Graham Thorpe : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ఫ్(Graham Thorpe) మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరేమో ఆయనది సహజమరణం చెప్పగా.. కాదు కాదు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడని ఆయన భార్య అమంద (Amanda) షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా న్యాయ విచారణలో థోర్ప్ గురించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఓ రైలు ప్రమాదంలో కన్నుమూశాడని బ్రిటన్ మీడియాకు కోర్టు తెలిపింది. దాంతో, అందరూ షాక్ అవుతున్నారు.
”సర్రేలో థోర్ప్ ఒక రైలు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. ఎషెర్ రైల్వే స్టేషన్ (Esher Railway Station)లో ఆయనను రైలు ఢీకొట్టింది. దాంతో, ఆయన అక్కడే మృతి చెందాడు’ అని మంగళవారం సర్రేలోని కార్నర్స్ కోర్టు వెల్లడించింది. ఇక బ్రిటన్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ .. ‘మాకు ఎషెర్ రైల్వే స్టేషన్ నుంచి ఆగస్టు 4 ఉదయం 8:26 గంటలకు ఓ ఫోన్ వచ్చింది.
BREAKING: Former England cricketer Graham Thorpe died after being struck by a train at a railway station in Surrey, the opening of an inquest into his death has heard.
Latest: https://t.co/r1M3waX4O8
📺 Sky 501, Virgin 602, Freeview 233 and YouTube pic.twitter.com/R3kTVjyAcB
— Sky News (@SkyNews) August 13, 2024
ఓ వ్యక్తి తీవ్రగాయాలతో పట్టాల మీద పడిఉన్నాడని ఆ ఫోన్ సారాంశం. అప్పటికే అక్కడకు చేరుకున్న వైద్యులు అతడిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఆయన చనిపోయాడని వాళ్లు చెప్పారు. మేమైతే అతడిది అనుమానాస్పద మృతి అని రికార్డు చేయలేదు’ అని చెప్పాడు.
‘థోర్ఫ్ను ఎంతో ప్రేమించే భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయనకు మేమంటే ఇష్టమే. థోర్ప్ 2022లోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కానీ, మేమంతా ఆయన్ను కాపాడుకున్నాం. ఆ తర్వాత ఆయన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. మేము ఆయన్ను డిప్రెషన్ నుంచి బయటపడేసేందుకు ఎన్నో విధాలా ప్రయత్నించాం. కానీ, ఆయన ఒత్తిడిని జయించలేకపోయాడు. గత కొంతకాలంగా థోర్ప్ ఆరోగ్యం సరిగ్గా లేదు. దాంతో, ఆయన తాను లేకుంటే కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారని అనుకున్నాడు. అందుకనే సూసైడ్ చేసుకున్నాడు’ అని అమంద చెప్పుకొచ్చింది.
థోర్ప్ 1993 నుంచి 2005 మధ్య ఇంగ్లండ్ తరఫున ఆడాడు వంద టెస్టులు, 82 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు. టెస్టులలో 44.66 సగటుతో 6,774 పరుగులు చేయగా వన్డేలలో 2,830 రన్స్ సాధించారు. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించాక కొన్నాళ్లపాటు అఫ్గానిస్థాన్ జట్టుకు హెడ్కోచ్గా పనిచేశారు. థోర్ప్ మృతి పట్ల ఇంగ్లండ్ ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు సంతాపం వ్యక్తం చేశారు.