హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : తమ సమస్యల పరిష్కారానికి టీజీఎస్ఆర్టీసీ ఎస్ డబ్ల్యూఎఫ్ (ఐఎన్టీయూసీ) పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన చలో బస్‌భవన్ మహాధర్నా నిర్వహించనున్నట్లు సంఘ నాయకులు రాజిరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని బస్ భవన్ ఎదుట నిర్వహించే ఈ ధర్నాకు పెద్ద ఎత్తున కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
రిటైర్ అయిన ఉద్యోగులకు ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని, ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులపై పెరిగిన పనిభారం తగ్గించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.