MG Windsor EV | జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) భారత్ మార్కెట్లో తన మూడో ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది. సెప్టెంబర్ 11న విండ్సార్ ఈవీ (Windsor EV) కారును ఆవిష్కరించనున్నది. కొమెట్ ఈవీ (Comet EV), జడ్ఎస్ ఈవీ (ZS EV) తర్వాత మార్కెట్లోకి వస్తున్న మూడో కారు విండ్సార్ ఈవీ (Windsor EV). టాటా నెక్సాన్.ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400, టాటా కర్వ్.ఈవీ కార్లకు గట్టి పోటీ ఇచ్చే తొలి ఇంటెలిజెంట్ సీయూవీ (CUV) కారు ఎంజీ విండ్సార్ ఈవీ (Windsor EV).
ఎంజీ విండ్సార్ ఈవీ (Windsor EV) కారులో రేర్ అండ్ ఫ్రంట్‌లో డే టైం రన్నింగ్ ల్యాంప్స్ ఎల్ఈడీ లైటింగ్, లైట్ బార్స్ ఉంటాయి. ఎయిరో డైనమిక్స్ మెరుగుదల కోసం డోర్ హ్యాండిల్స్ బాడీ వర్క్ తోపాటు సిట్ ఫ్లష్ గా ఉంటాయి. టూ-స్పోక్ స్టీరింగ్ వీల్,పనోరమిక్ సన్ రూఫ్, అంబియెంట్ లైటింగ్, బ్లాక్ అప్ హోల్ స్టరీ, 135- డిగ్రీ రీక్లైన్ ఫంక్షన్’ వంటి ఫీచర్లతో మల్టీ ఫంక్షనల్ యూనిట్‌గా ఉంటుంది. టచ్ స్క్రీన్ ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ‘క్లౌడ్ ఈవీ’ పేరుతో ఎంటరైంది. క్రాస్ ఓవర్ ఎక్స్ టీరియర్ స్టైల్, టూ చార్జింగ్ ఇన్లెట్స్, స్లీక్ ఎడ్ లైట్ యూనిట్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ మీద ఆల్ రౌండ్ కెమెరాలు నిలిచి ఉంటాయి.
ఎంజీ విండ్సార్ ఈవీ (MG Windsor EV) కారు 50.6 కిలోవాట్ల ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. సింగిల్ చార్జింగ్‌తో 460 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ కారు బ్యాటరీ 30 నిమిషాల్లో 30-100 శాతం చార్జింగ్ అవుతుంది. సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తోందీ కారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 134 బీహెచ్పీ విద్యుత్, 200 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి.
Maruti Suzuki Ertiga | ఎంపీవీ కార్లకు గిరాకీ.. మారుతి సుజుకి ఎర్టిగా యమ పాపులర్..!
BSA Gold Star 650 | 15న భారత్ మార్కెట్లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ లాంచింగ్.. ఇవీ డీటెయిల్స్..!
Realme C63 5G | 32-ఎంపీ ఏఐ ఫీచర్లతో రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ఇవీ డీటెయిల్స్..!