Samyukta Menon |భీమ్లానాయక్ సినిమాతో తెలుగులో ఎంట్రీలోనే మంచి బ్రేక్ అందుకుంది మలయాళ భామ సంయుక్తా మీనన్ (Samyukta Menon). ఆ తర్వాత బింబిసార, సార్ చిత్రాలతో హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం నిఖిల్‌తో కలిసి స్వయంభు సినిమాలో నటిస్తోంది సంయుక్తామీనన్. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ తాజాగా ఆసక్తికర విషయం ఒకటి ఫొటో రూపంలో షేర్ చేసుకుంది.
గ్లామర్ ప్రపంచం అంటే చక్కటి శరీర సౌష్ఠవాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక నాజూకుగా కనిపించేలా సైజ్ జీరో ప్యాక్ కొనసాగించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. అలాంటి వర్కవుట్ సెషనే పెట్టుకుంది. ఏకంగా ఈ భామ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు 108 రోజుల ప్రణాళిక వేసుకుంది. ఫిట్ నెస్ సెషన్ పూర్తయిన తర్వాత తన బాడీ ఫిజిక్‌ను చెక్ చేసుకుంటున్న స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సంయుక్తామీనన్. ఫిట్నెస్ మంత్రలో తనకు సహకరించిన ఫిట్నెస్ ట్రైనర్లు సుప్రియ, అరుణ్‌కు ధన్యవాదాలు తెలియజేసింది.
పవన్ కల్యాణ్ హీరోయిన్ అప్‌కమింగ్ హీరోయిన్లకు గట్టిపోటీనిచ్చేలా తనను తాను మేకోవర్ చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తూ.. చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోందంటున్నారు సినీ జనాలు.
Puri Jagannadh | పూరీ-రామ్ మాస్ బరాత్ షురూ అయింది రో.. డబుల్ ఇస్మార్ట్ బుకింగ్స్ టైం
Ravi Teja | సుమ, భాగ్య వీళ్లే ఫొటో తీయండి.. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో రవితేజ
Committee Kurrollu | యదువంశీ కథకు జీవం పోశాడు.. కమిటీ కుర్రోళ్లు మూవీపై రాంచరణ్