Committee Kurrollu | టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల సమర్పణలో శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu). యదువంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 9న విడుదలైన విషయం తెలిసిందే. ఓట్లు కొనేసిన తర్వాత ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ, గొర్రెల్లా కాకుండా మంచిచెడులను విశ్లేషించుకొని ఓటు వేయాలనే సందేశంతో రూపొందించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.7.50 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) కమిటీ కుర్రోళ్లు టీంకు విషెస్ తెలియజేశాడు. భారీ విజయాన్ని అందుకున్న సందర్భంగా కమిటీ కుర్రోళ్లు టీంకు శుభాకాంక్షలు. నిహారిక తల్లి నీ టీంతో కలిసి చేసిన హార్డ్‌వర్క్ నిజంగా స్పూర్తిదాయకం. సినిమా విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ చిత్రయూనిట్ మొత్తానికి నా అభినందనలు.. అని ట్వీట్ చేశాడు రాంచరణ్. యదువంశీ ఈ కథకు జీవం పోశాడని ప్రశంసలు కురిపించాడు రాంచరణ్.
ఇప్పటికే ఈ సినిమాపై మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, నాని, దేవీ శ్రీ ప్రసాద్ లాంటి టాప్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
Congratulations on the massive success of *Committe Kurrollu* Niharika Thalli ! The is well-deserved !! Your hard work and dedication, along with your team are truly inspiring. Kudos to the entire cast and crew for their incredible effort, and a special shoutout to the director… pic.twitter.com/Up6bSQDqPU
— Ram Charan (@AlwaysRamCharan) August 13, 2024
Ravi Teja | సుమ, భాగ్య వీళ్లే ఫొటో తీయండి.. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో రవితేజ