అర్వపల్లి, డిసెంబర్ 29 : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన. పేరుకే ప్రజా ప్రభుత్వం. హామీల అమలుల్లో సర్వత్రా విఫలం. హామీలే కదా ఎన్నైనా ఇద్దాం.. అమలు జరిగినప్పుడు కదా చూద్దా అన్న చందంగా తయారైంది. అర్వపల్లి మండల పరిధిలోని కొమ్మాలలో పల్లె దవఖానకు నిధులు మంజూరు అయి నెలలు గడుస్తున్నాయి. దీంతో ప్రజల నుండి తీవ్ర ఆరోపణలు వినవస్తున్నాయి. నిధులు మంజూరై టెండర్లు కూడా పూర్తి అయినప్పటికీ ఇప్పటివరకు పనులు మొదలు పెట్టకపోవడంతో నిధులు మురిగిపోయే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి పల్లె దవాఖానా పనులను వెంటనే ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.