Doug Bracewell | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ దిగ్గజం.. కారణమిదే..!
Doug Bracewell : న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డౌగ్ బ్రేస్‌వెల్ (Doug Bracewell) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు సోమవారం అతడు బైబై చెప్పేశాడు.
Doug Bracewell : న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డౌగ్ బ్రేస్‌వెల్ (Doug Bracewell) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు సోమవారం అతడు బైబై చెప్పేశాడు. ఆల్‌రౌండర్‌గా న్యూజిలాండ్ విజయాల్లో కీలకమైన అతడు 35 ఏళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకున్నాడు. పక్కటెముకల(Ribs) గాయంతో ఇబ్బంది పడుతున్న ఈ స్టార్ క్రికెటర్ ఈసారి దేశవాళీ సీజన్‌కు దూరమయ్యాడు. వయసు పైబడుతుండడంతో పాటు జూనియర్లు అవకాశాలు అందిపుచ్చుకుంటున్న వేళ రిటైర్మెంట్కు సమయం వచ్చేసిందని బ్రేస్‌వెల్ భావించాడు.
‘నా జీవితంలో క్రికెట్ చాలా గర్వించదగ్గది. చిన్నప్పుడు క్రికెటర్‌గా నేను కన్న కలల్ని నిజం చేసుకున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు న్యూజిలాండ్ బోర్డుకు కృతజ్ఞుడిని. నా దేశం తరఫున ఆడడం, దేశవాళీలో సెంట్రల్ డిస్ట్రిక్స్‌కు ప్రాతినిధ్యం వహించడం మర్చిపోలేను.ఈ సందర్భంగా నాతో కలిసి ఆడిన సహచరులకు, కోచ్‌లు, మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం గర్వకారణం. సుదీర్ఘ కాలం క్రికెట్ కెరీర్ సాగినందుకు చాలా సంతోషిస్తున్నా’ అని డౌగ్ బ్రేస్‌వెల్ తెలిపాడు.
News | Allrounder Doug Bracewell has announced his retirement from all cricket. Bracewell played 28 Tests, 21 ODIs and 20 T20Is for New Zealand taking 120 wickets and scoring 915 runs. He played a key role in New Zealand’s last Test victory over Australia, in Hobart in 2011,… pic.twitter.com/rdLjGeBQzL
— BLACKCAPS (@BLACKCAPS) December 28, 2025
ఆస్ట్రేలియాపై 6/40
బ్రేస్‌వెల్ 2008లో ఫస్ట్ క్రాస్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడేళ్లకే సెలెక్టర్ల దృష్టిలో పడి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 2011లో ఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్ టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కివీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన మూడో టెస్టులోనే ఆస్ట్రేలియాపై అత్యుత్తమ ప్రదర్శన(6/40)తో జట్టును గెలిపించాడీ దిగ్గజం. 2011 నుంచి 2023 మధ్య కాలంలో బ్రేస్‌వెల్ 28 టెస్టులు, 21 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.
Never forget Doug Bracewell’s match winning 6/40 in 2011 in Hobart to help NZ beat the Aussies in a Test in Australia for the first time in 26 years! Enjoy retirement Dougie!
(📹 @cricketcomau) pic.twitter.com/jsotRa50Ox— The ACC (@TheACCnz) December 29, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

