పెన్పహాడ్, డిసెంబర్ 29 : తాము పుట్టి పెరిగిన సొంత ఊరి పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకర్ధం కళావేదికను నిర్మించి బహుకరించారు పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామానికి చెందిన కొండేటి రామనర్సమ్మ- లింగారెడ్డి కుమారుడు, కోడలు కొండేటి జానకి రెడ్డి- మంజుల. రూ.2 లక్షల వ్యయంతో ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన కళావేదికను సర్పంచ్ వలపట్ల సైదమ్మ లింగయ్యతో కలిసి దాతలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల నోడల్ అధికారి వస్రం నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యార్థం ఈ సాంస్కృతిక వేదిక నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. ఇంకా దాతలు ముందుకొచ్చి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దొంగరి సుధాకర్. బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యూగేందర్, హెడ్ మాస్టర్ నర్సయ్య, ఉపాద్యాయులు మామిడి వెంకటయ్య, చెన్నూ ప్రభాకర్ రెడ్డి, మేకల శ్రీను, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పందిరి రేణుక వీరస్వామి, కుసుమ సిద్దారెడ్డి, కొండేటి అశోక్ పాల్గొన్నారు.