బర్మింగ్‌హామ్: ఇండియాతో జరగనున్న తొలి వన్డే(ENGvIND)లో.. ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ అతి సునాయాసంగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయిదు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ 4-0 తేడాతో నెగ్గి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే వన్డేలకు భారీ మార్పులతో ఇండియా జట్టు బరిలోకి దిగుతోంది. శుభమన్ గిల్ వన్డే జట్టు సారధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన శ్రేయాస్ అయ్యర్ .. వన్డేలకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత తుది జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా వ్యవహించనున్నాడు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ పాత్ర పోషించనున్నారు. బుమ్రా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ కృష్ణ, శివం దూబే .. పేస్ బౌలింగ్ చేయనున్నారు.
A look at #TeamIndia‘s Playing XI 🙌
Updates ▶️ https://t.co/2sg194tpxH #ENGvIND pic.twitter.com/J6HYlKXV1l
— BCCI (@BCCI) July 14, 2026