England : సొంతగడ్డపై బజ్‌బాల్ ఆటతో చెలరేగుతున్న ఇంగ్లండ్(England) ఆఖరి మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసింది. రెండు టెస్టుల్లో వెస్టిండీస్(West Indies)ను చిత్తుగా ఓడించి ఇప్పటికే కైవసం చేసుకున్న బెన్ స్టోక్స్ బృందం.. మూడో టెస్టు కోసం తుది జట్టును ప్రకటించింది.
విండీస్‌ను వైట్‌వాష్ చేయాలనుకుంటున్న ఇంగ్లండ్ రెండో టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. బర్మింగ్హమ్లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జూలై 26న ఆఖరి టెస్టు జరుగనుంది. వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తైన పర్యాటక వెస్టిండీస్ పరువు కోసం పోరాడనుంది.
We’ve named our XI for the third Test against the West Indies at Edgbaston 👇
— England Cricket (@englandcricket) July 25, 2024
ఇంగ్లండ్ జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.