Sankranti Holidays | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా, సంక్రాంతి సెలవులను మరికొన్ని రోజులు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జనవరి 10 నుంచి 16వ తేదీ వరకు సెలవులను మంజూరు చేశారు. జనవరి 15న సంక్రాంతి పండుగ ఉండగా, తర్వాతి రోజైన జనవరి 16 (కనుమ) ఐచ్ఛిక సెలవు కావడంతో సెలవులను ఆ రోజు వరకు పొడిగించారు. 17న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి.