Gold-Silver Rates | వరుసగా మూడో రోజూ భారీగా బంగారం ధర పతనం.. అదే బాటలో వెండి
Gold-Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం వరుసగా తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.1000 తగ్గి, రూ.70650లకు పతనమైంది. కిలో వెండి ధర కూడా రూ.3500 పతనమైంది.
Gold-Silver Rates | అంతర్జాతీయ పరిణామాలకు తోడు స్థానికంగా గిరాకీ తగ్గడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర గురువారం వరుసగా మూడో రోజు భారీగా తగ్గింది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.1000 తగ్గి రూ.70,650కి పతనమైంది. బుధవారం నాడు పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.71,650 వద్ద ముగిసింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ.35,00 పతనమై రూ.84 వేలకు దిగి వచ్చింది. బుధవారం కిలో వెండి ధర రూ.87,500 పలికింది.
ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్పటి నుంచి మూడు సెషన్లలో తులం బంగారం ధర రూ.5000 పతనమైంది. బంగారం, వెండితోపాటు పలు కీలక లోహాలపై కస్టమ్స్ డ్యూటీ భారీగా తగ్గి్స్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. బంగారం, వెండి దిగుమతిపై సుంకం 15 నుంచి ఆరు శాతానికి తగ్గించారు. దీంతో మంగళవారం తులం బంగారం ధర రూ.3,350 తగ్గింది. ఈ ఏడాదిలో బంగారం ధర భారీగా తగ్గడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 42.20 డాలర్లు పతనమై 2421.80 డాలర్లు పలికింది. న్యూయార్క్ లో ఔన్స్ వెండి ధర 28.04 డాలర్ల వద్ద ట్రేడయింది.
ఇవి కూడా చదవండి:
Citroen Basalt |టాటా కర్వ్కు పోటీగా సిట్రోన్ బసాల్ట్.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ.. !
Maruti Suzuki Ignis | భారత్ మార్కెట్లోకి మారుతి ఇగ్నిస్ రేడియన్స్.. బేస్ సిగ్మా కంటే ధర తక్కువ.. !
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

