సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Sep 16, 2020 , 17:16:42

నిర్ణాయక మూడో వన్డే..ఇంగ్లాండ్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

నిర్ణాయక మూడో వన్డే..ఇంగ్లాండ్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

మాంచెస్టర్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌, ఆ్రస్టేలియా మధ్య ఆఖరిదైన మూడో వన్డే ఆరంభమైంది. మూడోసారి టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. గాయంతో తొలి రెండు వన్డేలకు దూరమైన ఆస్ట్రేలియా స్టార్‌  బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ నిర్ణాయక మూడో వన్డేకు దూరమయ్యాడు.  చివరిదైన మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవాలనే ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.   సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి.  అన్ని విభాగాల్లో రెండు జట్లు బలంగా ఉండటంతో పోరు రసవత్తరంగా సాగనుంది.logo