IND vs PAK | కొలంబో: వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ భారత జట్టు.. ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌కు సిద్ధమైంది. ఆదివారం మెగా ఫైట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో యంగ్‌ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు జట్ల మధ్య లీగ్ దశలో జరిగిన పోరులో భారత్‌దే పైచేయి అయింది.
టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన యష్ ధుల్ సారథ్యంలోని భారత్ అదే జోరులో పాక్‌ను ఓడించేందుకు పట్టుదలతో ఉంది.