ICC : క్రికెట్లో ఈమధ్య చిన్న జట్లు కూడా విశేషంగా రాణిస్తున్నాయి. పెద్ద టీమ్‌లకు షాకిస్తూ.. సంచలన విజయాలతో ఔరా అనిపిస్తున్నాయి. అందుకే సదరు బోర్డులకు ప్రోత్సాహకంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC ) అవార్డులు ప్రకటించింది. గతేడాది అద్భుతమైన ఆటతో వార్తల్లో నిలిచిన నేపాల్ (Nepal), భుటాన్ (Bhutan), అమెరికా (USA)తో పాటు ఎనిమిది దేశాలను డెవలప్మెంట్ అవార్డ్స్-2024కు ఎంపిక చేసింది ఐసీసీ. ఈ అవార్డు అందుకున్న వాటిలో ఇండోనేషియా, నమీబియా, స్కాంట్లాడ్, టాంజానియా, వనౌటు క్రికెట్ బోర్డులు ఉన్నాయి. సింగపూర్‌లో ఆదివారం ఐసీసీ ఛీఫ్ జై షా (Jai Shah) ఇతర సభ్యులతో కలిసి ఈ బోర్డులకు అవార్డ్స్ అందజేశారు.
ప్రపంచ క్రికెట్లోఒకప్పుడు ఎనిమిది జట్ల పేర్లే ప్రముఖంగా వినిపించేవి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంకలు మాత్రమే అభిమానులను అలరించేవి. కానీ, ఇప్పుడు దాదాపు ప్రతిదేశం క్రికెట్ జట్టును ఏర్పాటు చేసుకుంది. ఐసీసీ ప్రోద్బలం కూడా తోడవ్వడంతో అమెరికా, నేపాల్, స్కాట్లాండ్, నమీబియా వంటి చిన్న జట్ల సంచలనాలు సృష్టిస్తున్నాయి. తమ ప్రాంతంలో క్రికెట్ పురోగతికి కృషి చేస్తున్న ఈ దేశాల బోర్డులను ఐసీసీ డెవలప్మెంట్ అవార్డ్స్‌తో సత్కరించింది. మొత్తం 15 జట్లు షార్ట్ లిస్ట్ కాగా.. ఎనిమిది బోర్డులను ఎంపిక చేశారు.
Persatuan Cricket Indonesia won the ICC Cricket 4 Good Social Impact Initiative of the Year for their “Cricket for Confidence” programme, bringing the sport to rural schoolgirls 🇮🇩 pic.twitter.com/RiKfNqzYHy
— ICC (@ICC) July 20, 2025
నిరుడు స్వదేశంలో జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో సంచలన ప్రదర్శనతో సూపర్ – 8కు దూసుకెళ్లింది అమెరికాజట్టు. దాంతో, ‘ఐసీసీ అసోసియేట్ మెంబర్ మెన్స్ టీమ్ పెర్ఫార్మెన్స్’ అవార్డును అమెరికా బోర్డుకు అందించింది ఐసీసీ. క్రికెట్ నమీబియాను ‘ఐసీసీ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది.
క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ‘ఉమెన్ క్రికెట్ ఇనిషియేటివ్’ అవార్డుకు భూటాన్ క్రికెట్ మండలి, వనౌటు క్రికెట్ సంఘం ఎంపికయ్యాయి. నేపాల్ క్రికెట్‌కు సంఘానికి ‘ఐసీసీ డిజిటల్ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకుంది.
Tanzania Cricket Association received the ICC criiio Cricket Festival of the Year with Rexona award for their inspiring “From Kitchen to Crease” event, which united 120 women through cricket 🇹🇿 pic.twitter.com/z0t1ZtdbO8
— ICC (@ICC) July 20, 2025