బిజినేపల్లి : ప్రతి ఒక్కరు మొక్కలు( Plants ) నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ( MLA Rajesh Reddy ) అన్నారు. మండలంలోని వట్టెం గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పరిసరాల్లో హరిత హారంలో ( Haritha Haram ) భాగంగా ఆదివారం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి పచ్చదనం పెంచడం వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, తద్వారా పంటలు బాగా పండుతాయని పేర్కొన్నారు. మొక్కలు నాటి రక్షణ కంచలు ఏర్పాటు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో దేవస్థాన వ్యవస్థాపక సభ్యులు సందడి ప్రతాప్ రెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ అనంత నరసింహా రెడ్డి, నిత్యాన్న సత్రం కమిటీ అధ్యక్షులు వాస ఈశ్వరయ్య, సందడి రామచంద్రా రెడ్డి, సురేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, సుబ్బా రెడ్డి, చంద్రా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, హకీమ్ మురళి, బండారు రాజశేఖర్, బాదం కృష్ణయ్య, శ్రీరామ్ రెడ్డి, భాస్కరాచారి, తిరుపతయ్య, ఈశ్వర్, రాములు, శీను, నసీర్, ఎంపీడీవో కథలప్ప, నవోదయ పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.