IND vs ENG : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు బజ్ బాల్ (Buz Ball)ఆటతో రెచ్చిపోతున్నారు. అర గంట క్రితం భారత బ్యాటర్లు తడబడిన చోట బౌండరీలతో చెలరేగుతున్నారు. తొలి ఓవర్ నుంచే దూకుడు కనబరిచిన బెన్ డకెట్ (56) ఫోర్లతో హోరెత్తిస్తూ హాఫ్ సెంచరీ బాదేశాడు. బుమ్రా, సిరాజ్.. అరంగేట్రం కుర్రాడు అన్షుల్ కంభోజ్లను ఉతికేస్తూ స్కోర్ బోర్డును జెడ్ స్పీడ్‌తో ఉరికించాడు డకెట్. మరో ఎండ్‌లో జాక్ క్రాలే(52) సైతం ఫిఫ్టీ కొట్టేశాడు.
డకెట్, క్రాలే విధ్వంసంతో ఆతిథ్య జట్టు స్కోర్ 19 ఓవర్లకే వంద దాటింది. ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ గిల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. ఈ జోడీ ఇలానే విరుచుకుపడితే భారత్‌కు కష్ట కాలమే. 20 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్.. 109. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో స్టోక్స్ సేన 248 పరుగులు వెనకబడి ఉంది.
A 46-ball half-century for Ben Duckett – his first fifty since the Headingley Test 👊https://t.co/bFpNZVmJPb #ENGvIND pic.twitter.com/S0CUJXZHIC
— ESPNcricinfo (@ESPNcricinfo) July 24, 2025
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో కీలకమైన మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు ఆలౌటయ్యింది. లంచ్ తర్వాత టకటకా వికెట్లు కోల్పోయిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకే కుప్పకూలింది. పాదం నొప్పిని పంటిబిగువన భరిస్తూనే రిషభ్ పంత్ (54).. సమయోచిత బ్యాటింగ్‌తో శార్థూల్ ఠాకూర్(41) పోరాడినా బెన్ స్టోక్స్ (5-72) దెబ్బకొట్టాడు. ఐదు వికెట్లుతో చెలరేగిన ఇంగ్లండ్ సారథికి స్పీడ్‌స్టర్ ఆర్చర్ కూడా తోడవ్వడంతో రెండో సెషన్లో కాసేపటికే గిల్ సేన ఇన్నింగ్స్ ముగిసింది.