KTR birthday | సిరిసిల్ల రూరల్, జూలై 24 : సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు అన్నారు. కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను పండగలా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని.. సిరిసిల్లలో జరిగిన కేటీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బీఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్, పార్టీ నేతలతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. మొదట కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా కేటీఆర్ పంపించిన కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ జన్మదిన వేడుకలతో సిరిసిల్లలో పండుగ వాతావరణం సంతరించుకుందన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా అభాగ్యులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేలా ప్రజలు దివించాలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, తదితరులు ఉన్నారు.
Srisailam Temple | శ్రీశైలం మల్లన్న ఆలయానికి 27రోజుల్లో రూ.4.17కోట్ల ఆదాయం..!
Ramavaram : జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చు : జీఎం షాలెం రాజు
KTR | తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం కేటీఆర్ : ఎమ్మెల్యే కొనింటి మానిక్ రావు