IND vs PAK : భారత ఫీల్డర్ల వైఫల్యంతో భారీ స్కోర్ దిశగా సాగుతున్న పాకిస్థాన్‌కు శివం దూబే షాకిచ్చాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడుతూ రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సయీం ఆయూబ్(21)ని ఔట్ చేశాడు. తొలి ఓవర్లోనే క్యాచ్ నేలపాలు చేసిన అభిషేక్ శర్మ ఈసారి చక్కగా బంతిని అందుకొని గర్జించాడు. దాంతో.. 93 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ పడింది. ఓపెనర్ షహీబ్జద ఫర్హాన్(56), హుస్సేన్ తలాట్ (6) క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లకు స్కోర్.. 103-2.
సూపర్ 4 మ్యాచ్‌లో21 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్ ఆ తర్వాత పుంజుకుంది. భారత బౌలర్ల, ఫీల్డర్ల వైఫల్యంతో ధనాధన్ ఆడిన సయీం ఆయూబ్ (4), ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్ (6) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్ ప్లేలో ఇద్దరూ బౌండరీలతో రెచ్చిపోగా వికెట్ నష్టానికి 55 రన్స్ చేసింది పాక్.
Shivam Dube – the man with the golden arm – breaks the 72-run partnership! 🇮🇳🤝
Saim Ayub departs for 21 (17) after getting a life on 4. ❌
Abhishek Sharma takes a stunner to dismiss Saim Ayub! 👏
🇵🇰 – 93/2 (10.3)#SaimAyub #ShivamDube #T20Is #AsiaCup #INDvPAK pic.twitter.com/qPBXQI4xgU
— Cricket City (@yadu1cayush) September 21, 2025
ఆ తర్వాత కూడా ఈ జోడీ దూకుడు పెంచుతూ పోయింది. కుల్దీప్ వేసిన 9వ ఓవర్లో ఆయూబ్, ఫర్హాన్ చెరొక సిక్సర్‌తో రెచ్చిపోయారు. రెండో వికెట్‌కు 72 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని శివం దూబే విడదీశాడు. అభిషేక్ ఒడిసిపట్టుకున్నాడు. 93వద్ద.. రెండో వికెట్ పడింది.