Taxpayer | క్రికెట్ (cricket).. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆటకు ఉన్న క్రేజ్ మరే ఇతక క్రీడకూ లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెటర్లను అభిమానులు దేవుళ్లలా పూజిస్తుంటారు. వాళ్లకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సినీ తారలకు కూడా ఉండదు. క్రికెటర్లు కూడా ఈ ఆట ద్వారా బాగానే సంపాదిస్తుంటారు. తమ ఆటతీరుతోపాటు ఇతర మార్గాల ద్వారా రూ.కోట్లు అర్జిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆదాయపన్ను కూడా కడుతుంటారు. ఇలా ఈ ఏడాది అత్యధికంగా ట్యాక్స్ పే చేసిన క్రికెటర్ ఎవరో మీకు తెలుసా..? ఎవరో కాదండీ మన విరాట్ కోహ్లీనే. ఈ ఏడాది ఆయన ఏకంగా రూ.కోట్ల రూపాయలను ఆదాయపన్ను శాఖకు కట్టారు.
రన్ మెషీన్‌గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి తెలియని వారు ఉండరు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. టీమిండియా (Team India)లో టాప్ బ్యాటర్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కింగ్ కోహ్లీనే. కేవలం ఆట పరంగానే కాదు సంపాదనలోనూ అతను కింగే. క్రికెట్ ద్వారానే కాకుండా యాడ్స్, ఇతర బిజినెస్‌ల ద్వారా కోహ్లీ రూ.వందల కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే, సంపాదనకు తగ్గట్టు ట్యాక్స్ పే చేస్తున్న క్రికెటర్లలోనూ కోహ్లీ ఫస్ట్‌ప్లేస్‌లో ఉన్నాడు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా పన్ను చెల్లించిన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ తొలి స్థానంలో నిలిచాడు. కోహ్లీ ఏకంగా రూ.66 కోట్ల పన్ను చెల్లించాడు. ట్యాక్స్ రేట్ల ప్రకారం చూస్తే ఆయన ఆదాయం ఆ ఒక్క ఏడాదిలో ఏకంగా రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక కోహ్లీ తర్వాత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) రూ.38 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. సచిన్ టెండూల్కర్ రూ.28 కోట్లు, సౌరభ్ గంగూలీ రూ.23 కోట్లు, భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రూ.13 కోట్లు, రిషభ్ పంత్ రూ.10 కోట్లు, అజింక్య రహానే రూ.8 కోట్లు, బుమ్రా రూ.7 కోట్లు, శిఖర్ ధావన్ రూ.6 కోట్లు, కేఎల్ రాహుల్ రూ.5 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.
Also Read..
Vinod Kambli | జ్వరం బారినపడ్డ మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ.. నిలకడగానే ఆరోగ్యం..!
Virat Kohli | మెల్బోర్న్ వీధుల్లో విరుష్క జంట చక్కర్లు.. వీడియో
Tania Sachdev | ఢిల్లీ సర్కారుపై చెస్ ప్లేయర్ విమర్శలు.. మరుసటి రోజే కలిసి మాట్లాడిన సీఎం