Virat Kohli | స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం ఆస్ట్రేలియా (Australia)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) సిరీస్ కోసం విరాట్ అక్కడికి వెళ్లారు. భార్య అనుష్క శర్మ (Anushka Sharma), పిల్లలు వామిక, అకాయ్ కూడా విరాట్‌తోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా ఖాళీ సమయంలో విరాట్ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
తాజాగా విరుష్క జంట మెల్బోర్న్ (Melbourne) వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఇద్దరూ కాసేపు సరదాగా గడిపారు. మెల్బోర్న్ కేఫ్‌కు వెళ్లి సందడి చేశారు. అక్కడ బ్రేక్‌ఫాస్ట్‌ను ఆస్వాదించారు. అనంతరం కేఫ్ కిచెన్‌ను విరాట్ సందర్శించారు. ఈ సందర్భంగా అద్భుతమైన ఫుడ్‌ను అందించినందుకు చెఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Virat Kohli And @AnushkaSharma Spotted Strolling On The Streets Of Melbourne.🥰♥️#Virushka #INDvAUS #AUSvIND @imVkohli pic.twitter.com/bwIEnWpOSn
— virat_kohli_18_club (@KohliSensation) December 24, 2024
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య నాలుగో టెస్ట్ మొదలవనున్నది. మెల్న్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే మ్యాచ్‌లో నెగ్గి.. సిరీస్‌లో పైచేయి సాధించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే ఇరుజట్లు చెరో మ్యాచ్‌లో నెగ్గగా.. మరో టెస్ట్ డ్రాగా ముగిసింది. పెర్త్ టెస్ట్‌లో భారీ విజయం సాధించిన టీమిండియా అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌లో బోల్తాపడింది. వర్షం కారణంగా గబ్బా టెస్ట్ డ్రాగా ముగియడంతో తృటిలో ఓటమి నుంచి బయపడింది. ఎంసీజీలో జరిగిన చివరి మూడు టెస్టుల్లో భారత్ రెండుసార్లు గెలువగా.. మరో మ్యాచ్‌ను డ్రాగా చేసుకుంది. అచ్చొచ్చిన ఎంసీజీలో వరుసగా నాలుగో సారి ఆతిథ్య జట్టును మట్టికరిపించాలని టీమిండియా భావిస్తున్నారు.
Also Read..