MCG Pitch Report | బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య నాలుగో టెస్ట్ మొదలవనున్నది. మెల్న్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే మ్యాచ్‌లో నెగ్గి.. సిరీస్‌లో పైచేయి సాధించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే ఇరుజట్లు చెరో మ్యాచ్‌లో నెగ్గగా.. మరో టెస్ట్ డ్రాగా ముగిసింది. పెర్త్ టెస్ట్‌లో భారీ విజయం సాధించిన టీమిండియా అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌లో బోల్తాపడింది. వర్షం కారణంగా గబ్బా టెస్ట్ డ్రాగా ముగియడంతో తృటిలో ఓటమి నుంచి బయపడింది. ఎంసీజీలో జరిగిన చివరి మూడు టెస్టుల్లో భారత్ రెండుసార్లు గెలువగా.. మరో మ్యాచ్‌ను డ్రాగా చేసుకుంది. అచ్చొచ్చిన ఎంసీజీలో వరుసగా నాలుగో సారి ఆతిథ్య జట్టును మట్టికరిపించాలని టీమిండియా భావిస్తున్నారు.
నాలుగో టెస్ట్‌కు మెల్బోర్న్ గ్రౌండ్ పిచ్ విషయానికి వస్తే.. పిచ్‌పై గడ్డి బాగానే ఉంది. కొత్త బంతితో బౌలర్లు చూపే అవకాశం ఉంటుంది. అదనపు బౌన్స్‌తో పాటు సీమ్‌ను రాబట్టొచ్చు. బ్యాటర్లు కుదురుకుంటే మాత్రం భారీగా పరుగులు తీయొచ్చు. టాస్ కీలకంగా మారే అవకాశం ఉంటుందని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. ఎంసీజీ టెస్టుల్లో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 307. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఇప్పటి వరకు 117 మ్యాచుల్లో 57 సార్లు గెలిచాయి. టీమిండియా మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఎంసీజీలో మంచి రికార్డు ఉన్నది. ఇక్కడ ఆడిన రెండుటెస్టుల్లో 15 వికెట్లు పడగొట్టాడు.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇప్పటి వరకు 117 మ్యాచులు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 57 సార్లు గెలిచింది. మొదట బౌలింగ్ చేసిన జట్టు 42 విజయాలు సాధించాయి. ఈ స్టేడియంలో తొలి ఇన్నింగ్స్ సగటు 307. సెకండ్ ఇన్నింగ్స్ సగటు 312. థర్డ్ ఇన్నింగ్స్ సగటు 252 కాగా.. ఫోర్త్ ఇన్నింగ్స్ సగటు 172గా ఉనమోదైంది. ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా పాకిస్థాన్‌పై 8 వికెట్ల నష్టానికి 624 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అత్యల్ప స్కోరు 1932లో దక్షిణాఫ్రికా 36 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లాబుస్చగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.