IND Vs AUS | బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గురువారం బాక్సింగ్ టెస్ట్ ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్‌కు ముందే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని స్థానంలో ఆఫ్ స్పిన్నర్ తనుష్ కొటియన్‌ను బీసీసీఐ ఆస్ట్రేలియా పర్యటన కోసం తుదిజట్టులోకి తీసుకుంది. మ్యాచ్‌కు ముందు మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌ను కాదని తనుష్కు అవకాశం కల్పించడంపై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం టీమిండియాలో ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయం కోసం అన్వేషించారు. మెల్బోర్న్, సిడ్నీలో ఇద్దరు స్పిన్నర్లు అవసరం కావొచ్చని.. దాంతో వెంటనే తనుష్కు పిలుపువచ్చింది. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీకి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో రోహిత్ మాట్లాడుతూ.. కుల్దీప్కు వీసా లేనందున కొటియన్‌ను జట్టులోకి తీసుకున్నారంటూ తనదైన శైలిలో చమత్కరించాడు.
అయితే, ముంబయి ఆల్‌రౌండర్‌పై కూడా కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఏ జట్టులో కొటియన్ సభ్యుడు. ఈ పర్యటనలో 44 పరుగులు చేయడమే కాకుండా ఓ మ్యాచ్‌లు వికెట్ సైతం తీశాడు. వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాకు చేరుకునే ప్లేయర్ అవసరమని, తనుష్ సిద్ధంగా ఉన్నాడని.. ఏ జట్టులో రాణించాడని తెలిపాడు. గత రెండు సంవత్సరాలుగా దేశవాళీ క్రికెట్లో కొటియన్ రాణిస్తున్నాడని.. సిడ్నీ, మెల్బోర్న్లో ఇద్దరు స్పిన్నర్లతో ఆడాల్సి వస్తే బ్యాకప్ అవసరమని రోహిత్ తెలిపాడు. అశ్విన్ స్థానంలో కుల్దీప్, అక్షర్‌ను తీసుకోకపోవడానికి కారణాలను వివరిస్తూ.. చైనామాన్ స్పిన్నర్ ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నాడని.. అక్షర్ ఇటీవలే తండ్రి అయ్యాడని తెలిపారు. కుల్దీప్ వందశాతం ఫిట్‌గా లేడని కెప్టెన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో తమకు తనుష్ బెస్ట్ ఆప్షన్‌గా నిలిచాడని.. దేశవాళీ టోర్నీల్లో తానేంటో నిరూపించుకున్నాడని రోహిత్ వివరించాడు.
ముంబయి రంజీ ట్రోఫీని గెలువడంలో కీలకంగా నిలిచాడని.. ఆల్ రౌండర్‌గా గొప్ప పాత్రను పోషించాడని హిట్‌మ్యాన్ ప్రశంసించాడు. 26 సంవత్సరాల తనుష్ 33 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడాడు. 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టాడు. 47 ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు చేయగా.. 41.21 సగటుతో 1525 పరుగులు చేశాడు. కోటియన్ 2018లో కేవలం 20 ఏళ్ల వయసులో మంబయి తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. సౌరాష్ట్రపై తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ముంబయి రంజీ జట్టుకు కీలకమైన ఆటగాడిగా మారాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీని ముంబయి గెలుచుకుంది. ఈ రంజీలో కోటియన్ 29 వికెట్ల కూల్చి.. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. 14 ఇన్నింగ్స్‌లలో 41.83 సగటుతో 502 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలున్నాయి.