Boxing Day Test AUS Final XI | బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా భారత్‌తో గురువారం నుంచి జరిగే బాక్సింగ్ టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. మెల్బోర్న్లో జరగనున్న ఈ బాక్సింగ్ డే టెస్టు కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టును వెల్లడించాడు. మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో కెప్టెన్ పాల్గొన్నాడు. మ్యాచ్‌కు ట్రావిస్ హెడ్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు తెలిపాడు. ఎంసీజీలో మెరుగైన రికార్డు ఉన్న స్కాట్ బోలాండ్కు సైతం తుదిజట్టులో చోటు దక్కింది. మెల్బోర్న్లో జరగనున్న టెస్టు కోసం ఆస్ట్రేలియా రెండు మార్పులు చేసినట్లు పాట్ కమిన్స్ తెలిపాడు.
నాథన్ మెక్‌స్వీనీ స్థానంలో శామ్ కాన్స్టాస్కు చోటు దక్కింది. ఎంసీజీలో శామ్ కాన్‌స్టాస్‌కి టెస్టుల్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. గాయంతో సిరీస్‌కు దూరమైన జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో బోలాండ్కు చోటు కల్పించినట్లు పాట్ కమిన్స్ పేర్కొన్నాడు. ట్రావిస్ హెడ్ ఫిట్‌గా లేకపోతే అతని స్థానంలో ఇంగ్లిస్‌కు గతంలో చెప్పిన విషం తెలిసిందే. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తర్వాత టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా శామ్ కాన్స్టాస్ నిలిచాడు. కమిన్స్ తన 18వ ఏట 2011లో తన టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 19 ఏళ్ల వయసులో కాన్స్టాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఉస్మాన్ ఖవాజా, శామ్ కాన్స్టాస్, మార్నస్ లాబుస్చగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.