IPL Record Breakers : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే రికార్డులకు నెలవు. పొట్టి ఫార్మాట్ తలరాతనే మార్చిన ఈ లీగ్ ఎందరో క్రికెటర్లను లక్షాధికారులను, ఇక స్టార్ ఆటగాళ్లను ఏకంగా కోటీశ్వరులను చేసింది. అందుకనే వేలం వస్తుందంటే చాలు ఈసారి రికార్డు బ్రేకర్ ఎవరు? ఎంత ధర పలుకుతాడు? ఇలా అభిమానుల బుర్రలో బోలెడు ప్రశ్నలు ఉద్భవిస్తాయి. అటు ఫ్రాంచైజీలను ఇటు ఫ్యాన్స్‌ను ఉత్కంఠకు గురిచేసే మెగా వేలానికి మళ్లీ కౌంట్‌డౌన్ మొదలైంది.
నవంబర్ 24, 25వ తేదీల్లో జెడ్డా వేదికగా జరుగబోయే మెగా వేలం పాటకు బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యం ఏర్పాట్లు చకచకా చేసేస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ప్రతి వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలు తెలుసుకుందామా..
ఐసీసీ 2007లో ప్రవేశపెట్టిన పొట్టి వరల్డ్ కప్ క్రేజ్ చూశాక ‘ఇక భవిష్యత్ టీ20లదే’ అనుకున్న బీసీసీఐ (BCCI) ఐపీఎల్‌కు ఊపిరి పోసింది. అలా పుట్టుకొచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే టాప్ లీగ్‌గా పేరొందింది. అందుకేనేమో ఐపీఎల్లో ఒక్కసారి ఆడిన జన్మధన్యమే అనుకోని ఆటగాళ్లు ఉండరు. 2008లో జరిగిన తొలి సీజన్ వేలంతో పోల్చితే ఇప్పుడు ఆటగాళ్ల ధర అమాంతం పెరిగిపోయింది.
ఇక 2008 మెగా వేలంలో రికార్డు ధర పలికింది ఎవరంటే.. అప్పటి భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni). టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన మహీ భాయ్ వేలంలో హాట్‌కేకులా మారాడు. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9.5 కోట్లు పెట్టి మరీ ధోనీని కొన్నది.
Costliest Player at the IPL Auction each year💸🏏
Who will be in the IPL 2025 Auction?👀
.
.
.
.#janntupdates #IPL2025Auction #IPL #IndianPremierLeague #India #BCCI #Cricket #dafabet #dafabetindia #dafaNews #dafabetsolution pic.twitter.com/8nsNvxKaXB— Jannat Updates (@JannatUpdates18) November 18, 2024
ఇక రెండో సీజన్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్, ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌లు రికార్డు ధర పలికారు. పీటర్సన్‌ను ఆర్సీబీ రూ.9.8 కోట్లకు సొంతం చేసుకోగా.. సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అంతే ధరకు ఫ్లింటాఫ్ను పట్టేసింది. ఇక 2010 వేలంలో న్యూజిలాండ్ పేసర్ షేన్‌బాండ్(Shane Bond), వెస్టిండీస్ చిచ్చరపిడుగు కీరన్ పొలార్డ్‌లు అందరికంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోయారు. బాండ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.4.8 కోట్లకు కొనగా.. పొలార్డ్‌ను ముంబై అంతే ధరకు సొంతం చేసుకుంది.
కోల్‌కతా గౌతం గంభీర్‌ను 2011 వేలంలో రూ.11.04 కోట్ల రికార్డు ధరకు పట్టుకుపోయింది. 2012లో భారత జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రూ.12.8 కోట్లకు సీఎస్కే హస్తగతం చేసుకోగా.. 2013 వేలంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ.6.3 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అనంతరం జరిగిన 2014 వేలంలో యువరాజ్ సింగ్‌కు ఆర్సీబీ రూ.14 కోట్లు ఆఫర్ చేసింది.
🚨 NEWS 🚨
TATA IPL 2025 Player Auction List Announced!
All the Details 🔽 #TATAIPLhttps://t.co/QcyvCnE0JM
— IndianPremierLeague (@IPL) November 15, 2024
ఆ తర్వాత ఏడాది కూడా యూవీ రూ.16 కోట్ల ధరతో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక 2016లో షేన్ వాట్సన్‌ను రూ.9.5 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్(Ben Stokes)ను 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ రూ.14.5 కోట్లకు కొన్నది. ఆ తర్వాత ఏడాది అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ.12.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక 2019లో జయదేవ్ ఉనాద్కాత్, వరుణ్ చక్రవర్తిలు రూ.8.4 కోట్లు పలికారు. 2020లో ప్యాట్ కమిన్స్‌పై కోల్‌కతా ఏకంగా రూ.15.5 కోట్లు కుమ్మరించింది. ఆపై వేలంలో దక్షిణాఫ్రికా పేసర్ క్రిస్ మోరిస్ కోసం రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా రూ.16.25 కోట్లు సమర్పించింది.
The stage is set for the biggest carnival in world cricket! 🌟🔥 Get ready for the IPL Mega Auction—where dreams are made, teams are built, and legends are born! 🏏💥 #IPLMegaAuctionpic.twitter.com/47JHh4hZ2B
— Fantasy Khiladi (@_fantasykhiladi) November 15, 2024
అనంతరం.. ఇషాన్ కిషన్(Ishan Kishan)ను ముంబై ఇండియన్స్ రూ.15.50 కోట్లకు కొనగా.. ఆ తర్వాతి సీజన్లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక.. 17వ సీజన్ మినీ వేలంలో మిచెల్ స్టార్క్(Mitchell Starc) కోసం కోల్‌కతా ‘తగ్గేదేలే’ అంటూ రూ.24.75 కోట్లు సమర్పించింది. దాంతో, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడు మిస్సైల్ స్టార్క్ రికార్డు నెలకొల్పాడు. మరి.. ఈసారి మెగా వేలంలో స్టార్క్ కంటే ఎక్కువ ధరతో నయా చరిత్ర లిఖించగల క్రికెటర్ ఎవరో మరో వారంలో తేలిపోనుంది.
FOUR wicketkeeper-batters 💪
ONE to pick ✅
Which player should your IPL Team go all out for 🤔#TATAIPL pic.twitter.com/S4GqYpeyjD
— IndianPremierLeague (@IPL) November 18, 2024