అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ( Local body elections) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉన్న ప్రధాన అర్హతల్లో ఒకటిని తొలగించి చేసిన సవరణకు సోమవారం జరిగిన ఏపీ శాసనసభ ( Assembly) ఆమోదం తెలిపింది. వీటితో పాటు మరి కొన్ని బిల్లులకు పచ్చ జెండా ఊపింది.
ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారు పోటీకి అనర్హులు కాగా ఇకపై ఆ నిబంధనను సడలించింది. ఎంత మంది పిల్లలున్నా పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలను మారుస్తూ తీసుకొచ్చిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఏ
పీ పంచాయతీరాజ్ బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు-2024లకు ఆమోదం తెలిపింది. ఏపీ సహకార సంఘం సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్, ఆయూర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ , ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది.