AUS vs PAK : ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన పాకిస్థాన్ (Pakistan) పొట్టి పోరులో తల వంచింది. నిలకడ లేమితో మూడుకు మూడు మ్యాచుల్లో ఓడి వైట్‌వాష్‌కు గురైంది. సోమవారం జరిగిన ఆఖరి టీ20లో బ్యాటర్ల వైఫల్యంతో పాక్ 117 పరుగులకే ఆలౌటయ్యింది. స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్(61 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగగా కంగారూ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పొట్టి ఫార్మాట్లో తమకు తిరుగులేదని ఆస్ట్రేలియా మరోసారి చాటింది. స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయిన కసితో ఆడిన జోష్ ఇంగ్లిస్ బృందం మూడు టీ20ల్లో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. విధ్వంసక ఆటగాడు మార్కస్ స్టోయినిస్(61 నాటౌట్) వీరకొట్టుడుకు 117 పరుగుల లక్ష్యాన్ని మరో 8 ఓవర్లు ఉండగానే ఆసీస్ ఛేదించింది.
Marcus Stoinis puts on a hitting spectacle as Australia canter to 3-0 🏆 https://t.co/KtW78aeqjF | #AUSvPAK pic.twitter.com/CI8G91nHyV
— ESPNcricinfo (@ESPNcricinfo) November 18, 2024
వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ ఆసీస్ పొట్టి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. తొలి రెండు టీ20ల్లో చివరిదాకా పోరాడినా పాక్ బ్యాటర్లు మూడో మ్యాచ్‌లో మాత్రం తోక ముడిచారు. అరోన్ హర్డీ(3/21), ఆడం జంపా(2/11), పేసర్ స్పెన్సర్ జాన్సన్(2/24)లు విజృంభించగా అందరూ డగౌట్‌కు క్యూ కట్టారు. ఈమధ్య పేలవ ఆటతో విమర్శల పాలవుతున్నమాజీ కెప్టెన్ బాబర్ ఆజాం(41), వికెట్ కీపర్ హసీబుల్లా ఖాన్(24) లు మాత్రమే కాసేపు పోరాడారు. మిగతావాళ్లు రాణించకపోవడంతో పాక్ 117 పరుగులకే కుప్పకూలింది.
Super economical from Zampa & the big wicket of Babar to boot; Aaron Hardie records his best in T20Is 👏 #AUSvPAK pic.twitter.com/vQ1FQ8lTuI
— ESPNcricinfo (@ESPNcricinfo) November 18, 2024
అనంతరం స్వల్ప ఛేదనలో ఆసీస్ 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మాథ్యూ షార్ట్(2)ను వెనక్కి పంపిన షాహీన్ ఆఫ్రిది కంగారూలను ఒత్తిడిలో పడేశాడు. అయితే.. కుర్రాడు ఫ్రేజర్ మెక్‌గుర్క్(18), కెప్టెన్ జోష్ ఇంగ్లిస్(27)లు బౌండరీలతో విరుచుకుపడి పాక్ బౌలర్ల లయను దెబ్బతీశారు. మెక్‌గుర్క్ అనంతరం వచ్చిన మార్కస్ స్టోయినిస్(61) భారీ షాట్లతో హడలెత్తించాడు. కేవలం 27 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాదేసి మెరుపు అర్ధ శతకంతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.