Foxconn | నాలిక్కర్చుకున్న ఫాక్స్‌కాన్.. ఇక ఆ పని చేయొద్దని స్పష్టమైన ఆర్డర్..!
Foxconn | ఐ-ఫోన్ల అసెంబ్లింగ్ సంస్థ ఫాక్స్‌కాన్ (Foxconn).. భారత్ లో ఉద్యోగ నియామకాల కోసం చేపట్టే ఉద్యోగ ప్రకటనల్లో లింగం, వయస్సు, వైవాహిక స్థితి గురించి పేర్కొనరాదని స్పస్టమైన ఆదేశాలు జారీ చేసింది .
Foxconn | ఐ-ఫోన్ల అసెంబ్లింగ్ సంస్థ ఫాక్స్‌కాన్ (Foxconn) తన పొరపాటును సరిదిద్దుకుంటున్నది. భారత్‌లో ఐ-ఫోన్ (iPhone) అసెంబ్లింగ్ వర్కర్ల నియామక ప్రక్రియ చేపడుతున్న ఏజెన్సీ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆపిల్ ఐ-ఫోన్ల అసెంబ్లింగ్ కోసం ఉద్యోగ నియామకాలకు జారీ చేసే వాణిజ్య ప్రకటనల్లో వయస్సు, లింగం, వైవాహిక స్థితి గురించి పేర్కొనరాదని స్పష్టం చేసింది. వివాహిత మహిళలకు అదనపు బాధ్యతలు ఉన్నాయన్న పేరుతో వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఫాక్స్‌కాన్ నిరాకరిస్తున్నదని గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్రం.. విచారించి తమకు నివేదిక అందజేయాలని రీజనల్ చీఫ్ లేబర్ కమిషనర్‌ను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది మే వరకూ తమకు ఉద్యోగుల నియామక బాధ్యతలు నిర్వర్తించించిన భారత్ ఏజెన్సీలను.. వాణిజ్య ప్రకటనల్లో తమ పేర్లు వాడొద్దని, ప్రామాణికంగా విధి విధానాల్లో మార్పు చేయాలని ఫాక్స్ కాన్ ఆదేశించినట్లు సమాచారం. అలాగే నియామక సంస్థలు మీడియాతో మాట్లాడవద్దని, అలా మాట్లాడితే వారి కాంట్రాక్టులు రద్దు చేస్తామని ఫాక్స్ కాన్ హెచ్చరించినట్లు తెలుస్తున్నది. అంతే కాదు నియామక వాణిజ్య ప్రకటనల్లో ఫాక్స్ కాన్ పేరు వాడొద్దని పేర్కొన్నట్లు సమాచారం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

