Aaqib Javed : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త హెడ్‌కోచ్ నియామకంపై మీడియాలో వస్తున్న వార్తల్ని నిజం చేసింది. ప్రస్తుతం కోచ్‌గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా దిగ్గజం జేసన్ గిలెస్పీకి షాకిచ్చింది. 1992 వన్డే వరల్డ్ కప్ హీరో అయిన అకీబ్ జావేద్ (Aaqib Javed )ను మధ్యతంర కోచ్‌గా నియమించింది. వన్డే, టీ20ల్లో పాకిస్థాన్ జట్టుకు జావెద్ కోచ్‌గా సేవలందిస్తాడని సోమవారం పాకిస్థాన్ బోర్డు తెలిపింది.
వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ వరకూ జావెద్ మధ్యంతర కోచ్‌గా పనిచేస్తాడని పీసీబీ వెల్లడించింది. ఈమధ్యే జావేద్ పురుషుల జట్టు సెలెక్షన్ కమిటీలో సీనియర్ సభ్యుడిగా చేరాడు. గతంలో పాక్ జట్టుకు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్నందున అతడికే మళ్లీ వన్డే, టీ20 కోచ్ బాధ్యలు అప్పగించాలని పీసీబీ నిర్ణయించుకుంది.
Aqib Javed confirmed interim white-ball head coach
Details here ⤵️ https://t.co/lNkZ7QRW4z
— PCB Media (@TheRealPCBMedia) November 18, 2024
ఈమధ్యే గ్యారీ కిర్‌స్టెన్ పాకిస్థాన్ వైట్ బాల్ కోచ్‌గా వైదొలిగాడు. దాంతో రెడ్ బాల్ కోచ్‌గా ఉన్న గిలెస్పీకి వన్డే, టీ20 జట్లకు మధ్యంతర కోచ్‌గా నియమించింది పీసీబీ. ప్రస్తుతం గిలెస్పీ ఆధ్వర్యంలోని పాక్ ఆస్ట్రేలియా గడ్డపై వన్డే, టీ20 సిరీస్‌లు ఆడుతోంది. అంతలోనే అకీబ్ జావేద్ పేరు తెరపైకి వచ్చింది. దాంతో, గిలెస్పీని తప్పించడం ఖాయం అనే వార్తలు వైరల్ అయ్యాయి. అందుకని నవంబర్ 17న పీసీబీ వివరణ ఇచ్చింది.
‘అబ్బే.. అదేం లేదు. ఇంతకుముందు ప్రకటన చేసినట్టే దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌కు జేసన్ గిలెస్పీనే పాకిస్థాన్ కోచ్‌గా వ్యవహరిస్తాడు’ అని నవంబర్ 17వ తేదీన పీసీబీ తెలిపింది.
మాజీ స్పీడ్‌స్టర్ అయిన జావేద్ 1992లో వరల్డ్ కప్ గెలిచిన పాకిస్థాన్ జట్టులో సభ్యుడు. ఆటకు వీడ్కోలు పలికన తర్వాత అతడు బౌలింగ్ కోచ్‌గా అవతారమెత్తాడు. జావేద్ కోచ్‌గా ఉన్న సమయంలోనే పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్( 2009) చాంపియన్‌గా అవతరించింది. అనంతరం అతడు పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు కోచ్‌గా సేవలందించాడు.
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో పాక్ ఆటగాళ్ల సంబురం
జావేద్ శిక్షణలో రాటుదేలిన యూఏఈ జట్టు వన్డే, టీ20 స్టేటస్ దక్కించుకుంది. అంతేకాదు 2015 వరల్డ్ కప్‌లో కూడా ఆడింది. కోచ్‌గా సూపర్ ట్రాక్ రికార్డు ఉన్న జావేద్‌ను శ్రీలంక క్రికెట్ బౌలింగ్ కోచ్‌గా తీసుకుంది. అంతేనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో లాహోర్ క్యాలండర్స్ జట్టుకు హెడ్‌కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా జావేద్ పనిచేశాడు.