Doug Bracewell : డ్రగ్స్, నిషేధిత మత్తు పదార్థాలను తీసుకోవడం.. డోప్ పరీక్షలో విఫలమై అథ్లెట్లు, క్రీడాకారులు నిషేధానికి గురవ్వడం ఈమధ్య మామూలై పోయింది. తాజాగా న్యూజిలాండ్ పేసర్ డోగ్ బ్రాస్‌వెల్ (Doug Bracewell) సైతం అలానే నిషేధానికి గురయ్యాడు. నిషేధిత పదార్థాల్లో ఒకటైన కొకైన్ (Cocaine) ఉపయోగించినందుకు అతడిని న్యూజిలాండ్ క్రికెట్ నెలపాటు సస్పెండ్ చేసింది. అయితే.. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..?
ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో సెంట్రల్ స్టేజ్, వెల్లింగ్టన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో అద్బుతంగా రాణించిన (2 వికెట్లు, 30 పరుగులు) డోగ్ బ్రాస్‌వెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అయితే.. ఏప్రిల్ నెలలో అతడు కొకైన్ తీసుకుని వైద్య పరీక్షల్లో దొరికిపోయాడు. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న న్యూజిలాండ్ స్పోర్ట్స్ కమిషన్ బ్రాస్‌వెల్‌పై కఠిన చర్యలకు సిద్దమైంది. మరోసారి అలాంటి తప్పిదానికి పాల్పడకుండా మూడు నెలల నిషేధం విధించింది.
Former Black Caps cricketer Doug Bracewell is sanctioned by the Sports Tribunal of New Zealand after testing positive for the use of cocaine 🏏 https://t.co/pUpb5CMCBc
— 1News (@1NewsNZ) November 18, 2024
అయితే.. బ్రాస్‌వెల్ కొకైన్ వాడినందుకు పశ్చాత్తాప పడుతూ.. వైద్యం చేయించుకున్నాడు. అందుకని అతడిపై సస్పెన్షన్‌ను 3 నెలల నుంచి ఒక నెలకు పరిమితం చేస్తూ కివీస్ క్రికెట్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిషేధం సమయం పూర్తి కావడంతో మళ్లీ దేశం తరఫున ఆడేందుకు బ్రాస్‌వెల్ సిద్ధమవుతున్నాడు.
భాగస్వామి రెనే బుర్రిడ్గేతో..
బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన బ్రాస్‌వెల్ చివరిసారిగా 2023లో న్యూజిలాండ్‌కు ఆడాడు. స్వదేశంలో శ్రీలంకతో వెల్లింగ్టన్ టెస్టులో అతడు పాల్గొన్నాడు. మూడు ఫార్మాట్లలో ఇప్పటివరకూ బ్రాస్‌వెల్ 69 సార్లు కివీస్ జెర్సీ వేసుకున్నాడు. అందులో 28 టెస్టులు, 21 వన్డేలతో పాటు 20 టీ20లు ఉన్నాయి. దేశం తరఫున ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా అంతర్జాతీ టీ20 లీగ్స్‌లో బ్రాస్‌వెల్ ఆల్‌రౌండర్‌గానూ రాణిస్తున్నాడు.
Doug Bracewell Replace Romario Shepard In JSK
Another Replacement Will Announce Soon…#WhistleForJoburg pic.twitter.com/XR1OnHHu63
— YELLOVE 𝕏 Fever™ (@hajuri_janardan) January 28, 2024