Sumesh Shaukeen | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుమేష్ షౌకీన్ సోమవారం మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆప్ పార్టీకి కైలాష్ గెహ్లాట్ రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై కేజ్రీవాల్‌ని ప్రశ్నించగా.. తాను స్వేచ్ఛగా ఉన్నానన్నారు. ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చన్నారు. బీజేపీ నేత, కిరాడీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్ ఝా ఆదివారం ఆప్‌లో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో పార్టీ తీర్థం స్వీకరించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ పూర్వాంచల్ ప్రజల కోసం అనిల్ ఎన్నో సేవలందించారన్నారు. ఆయన రాకతో ఢిల్లీలో పార్టీ బలోపేతం అవుతుంది. సుమేష్ షౌకీన్ కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే. 2008లో మటియాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2013, 2015, 2020లో కాంగ్రెస్ టికెట్‌పై నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.