PCB : పాకిస్థాన్ బోర్డు త్వరలోనే కొత్త హెడ్‌కోచ్‌ను నిమిస్తుందనే వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ జట్టు ఆట మాదిరిగానే పీసీబీ తీరు కూడా అయోమయంగా ఉందంటూ పలువురు పాక్ బోర్డును వివర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్‌కోచ్ నియామకంపై వస్తున్న వార్తలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) చెక్ పెట్టింది.
ప్రస్తుతం రెడ్ బాల్ కోచ్‌గా, వన్డే, టీ20లకు మధ్యంతర కోచ్‌గా సేవలందిస్తున్న జేసన్ గిలెస్పీ(Jason Gillespie)ని తప్పించడం లేదని పీసీబీ చెప్పింది. ‘అబ్బే.. అదేం లేదు. ఇంతకుముందు ప్రకటన చేసినట్టే దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌కు జేసన్ గిలెస్పీనే పాకిస్థాన్ కోచ్‌గా వ్యవహరిస్తాడు’ అని నవంబర్ 17వ తేదీన పీసీబీ తెలిపింది.
EXCLUSIVE: Jason Gillespie is set to be removed as Pakistan head coach 🔁
Full story: https://t.co/YLdvBVi8BL pic.twitter.com/f4m6N4BSnq
— ESPNcricinfo (@ESPNcricinfo) November 17, 2024
విదేశీ కోచ్‌లతో విసిగిపోయిన పీసీబీ స్వదేశీయులకే పట్టం కట్టాలని భావిస్తున్నట్ట పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. అందులో భాగంగానే జేసన్ గిలేస్పీ స్థానంలో తమ దేశానికే చెందిన మాజీ పేసర్ అకీబ్ జావెద్ (Aaqib Javed)కు కోచ్‌గా బాధ్యతలు అప్పగించేందుకు పావులు కదుపుతోందనే సమాచారం వైరల్ అయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కొత్త కోచ్‌గా జావెద్ పేరును అధికారికంగా పీసీబీ ప్రకటించనుందని టాక్ వినిపించింది. కానీ, అదంతా తూచ్ అని నింపాదిగా పీసీబీ చెప్పడం కొసమెరుపు.
భారత గడ్డపై నిరుడు వన్డే వరల్డ్ కప్ అనంతరం మికీ ఆర్థర్‌ను వైట్‌బాల్ కోచ్‌గా తప్పించింది పాక్ బోర్డు. ఆపై టీ20 వరల్డ్ కప్‌లో ఘోర వైఫల్యం అనంతరం గ్యారీ కిర్‌స్టెన్ (Gary Kirsten)ను ఏరికోరి మరీ కోచ్‌గా తెచ్చుకుంది. కానీ, ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే గిర్స్టెన్కు పాక్ బోర్డుతో పాటు ఆటగాళ్ల రాజకీయాలు నచ్చలేదు. దాంతో, ఇలాంటి జట్టుకు నేను కోచంగ్ ఇవ్వలేను అని ఈమధ్యే రాజీనామా చేశాడు. దాంతో పీసీబీ అంతర్మథనంలో పడింది. ఇంగ్లండ్ మాదిరిగా మూడు ఫార్మాట్లకు ఒకే కోచ్ సూత్రాన్ని పాటించాలని తొలుత అనుకుంది.
మికీ ఆర్థర్, గ్యారీ కిర్‌స్టెన్
ప్రస్తుతం టెస్టు జట్టు కోచ్‌గా ఉన్న జేసన్ గిలెస్పీకే వన్డే, టీ20 కోచ్‌గా పగ్గాలు అప్పగించింది. అయితే.. అంతలోనే ఏమైందో తెలియదు గిలెస్పీని తొలగించి.. అతడి స్థానంలో మాజీ పేసర్ 1996 వరల్డ్ కప్ హీరో అయిన అకీబ్ జావెద్‌కు బాధ్యతలు అప్పగించాలని పీసీబీ భావిస్తోందని ఐసీసీ, ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్‌లు వెలిశాయి. దాంతో, పీసీబీ గిలెస్పీనే కొనసాగిస్తామని చెప్పి తప్పుడు కథనాలకు చెక్ పెట్టింది.