అమరావతి : వైసీపీ (YCP) రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna reddy) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) సజ్జలను కో ఆర్డినేటర్‌గా నియమించారు. రాష్ట్ర కార్యదర్శులుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ, అనకాపల్లికి చెందిన బొడ్డేడ ప్రసాద్‌ను నియమించారు.
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు , ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిబాబు, ఆముదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌ను నియమించారు.