IPL 2025 : టీ20 క్రికెట్‌కు మరింత వన్నె తెచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రతి ఏడాది అభిమానులను అలరిస్తోంది. మండు వేసవిలో ఉత్కంఠ పోరాటాలతో క్రీడా వినోదాన్ని పంచుతోంది. స్టార్ ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాలు.. బౌలర్ల సంచలన ప్రదర్శన మాత్రమే కాదు హుషారుగా నృత్యం చేసే ఛీర్ లీడర్స్ (Cheerleaders) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆరంభ సీజన్ నుంచి పోడియం మీద డ్యాన్స్‌లు చేస్తూ.. ఆటగాళ్లలో, అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు అందాల భామలు.
తమ ఫ్రాంచైజీ ప్లేయర్లు ఫోర్ కొట్టినా, సిక్సర్ బాదినా.. బౌలర్లు వికెట్ తీయడమే ఆలస్యం చేతిలో మెరుపు రిబ్బన్లు పట్టుకొని డ్యాన్స్ చేస్తుంటారీ చక్కనమ్మలు. ఇంతకు వీళ్లు ఒక్క మ్యాచ్‌కు అత్యధికంగా
ఎంత సంపాదిస్తారో తెలుసా.. రూ.24 వేలు. ఫ్రాంచైజీని బట్టి ఛీర్‌లీడర్స్ జీతభత్యాలు మారుతుంటాయి.
Lucknow mein cheerleaders ke liye machhardani bhi lagai gayi hai! See how much we UP wale care about women. 😌❤️#IPL2025 #LSGvMI pic.twitter.com/sEzHxjSwDE
— Utkarsh Verma (@utkarshv13) April 4, 2025
ప్రస్తుతం పది జట్లకు ప్రత్యేకంగా ఛీర్‌లీడర్స్ ఉన్నారు. అయితే.. అన్ని ఫ్రాంచైజీలు వాళ్లకు సమానమైన వేతనం చెల్లిచడం లేదు. పోడియం మీద నృత్యాలతో అలరించే ఈ ముద్దుగుమ్మలకు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) రికార్డు స్థాయిలో రూ.24 వేలు చెల్లిస్తోంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యాలు ప్రతి మ్యాచ్‌కు రూ. 20 వేలు ఇస్తున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఛీర్లీడర్స్కు రూ.12 వేల నుంచి రూ. 17 వేలు ముట్టజెప్పుతున్నాయి.
Russian Cheerleaders Supporting KKR | IPL 2024 Final#MitchellStarc #KKR #kkrvssrh #kkrvsrh #srh #kolkataknightriders #srk #tataipl2024 #ipl2024 #tataipl #shreyasiyer #shahrukhkhan #bollywood #India #indiancricket #viratkohli #Cheerleaders #Russian pic.twitter.com/xafDSaxmv1
— Hammad Kurar (@HammadKurar) May 27, 2024
ఛీర్‌లీడర్స్ ఎంపిక చాలా కఠినంగా ఉంటుంది. అందం ఒక్కటే కాదు.. వయసు, ఫిట్నెస్, డ్యాన్స్ నైపుణ్యాలు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 19 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లనే ఎంచుకుంటారు. మొదటగా.. దరఖాస్తు చేసుకున్న అమ్మాయిలకు ఆడిషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫిట్నెస్ పరీక్ష(Fitness Test).. డ్యాన్స్ ప్రదర్శన ఆధారంగా ఛీర్‌లీడర్స్‌ను ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయినవాళ్లకు తమ ఫ్రాంచైజీ గురించి వివరిస్తుంది యాజమాన్యం.
మైదానంలో ఆద్యంతం హుషారుగా ఉండేలా వీళ్లకు తర్ఫీదునిస్తారు. ఛీర్లీడర్స్లో ఎక్కువ శాతం యూరప్, అమెరికా అమ్మాయిలు, మోడల్స్.. ఉంటారు. ఉక్రెయిన్, రష్యా, బెల్జియం, నార్వే.. వంటి దేశాలకు చెందిన సుందరీమణులు ఐపీఎల్లో ఛీర్లీడర్స్గా రాణిస్తూ.. ప్రతి సీజన్లో రూ.25 లక్షలకు పైగా ఆర్జిస్తున్నారు.
Dazzling on and off the field! 🤩
Come cheer for Sadde Shers in our #IPL2025 opener.#BeautyMeetsCricket #DazllerOnTheField #PunjabKings #GTvPBKS #BasJeetnaHai pic.twitter.com/sHgjLDc6gT
— Punjab Kings (@PunjabKingsIPL) March 25, 2025
ప్రతి జట్టుకు కనీసం 10 నుంచి 15 మంది ఛీర్‌లీడర్స్ ఉంటారు. మైదానంలో మెరుపుతీగల్లా కనిపిస్తూ.. హుషారుగా నర్తించే ఛీర్లీడర్స్కు వేలల్లో డబ్బులు ఇవ్వడమే కాకుండా అదనపు సౌలభ్యాలు కల్పిస్తాయి ఫ్రాంచైజీలు. రవాణా, హోటళ్లలో బస, భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాయి. అంతేకాదు వాళ్ల భద్రతకు పెద్ద పీట వేస్తాయి. మ్యాచ్ జరిగే స్టేడియంలో వీళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తాయి. తద్వారా ఈ అందాల మగువలు పోడియం మీద అద్భుత ప్రదర్శన కనబరుస్తుంటారు.