Novak Djokovic : స్టార్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్(Novak Djokovic) మరో ఘనత సాధించాడు. రికార్డు స్థాయిలో ఎనిమిదో ఏడాదిని వరల్డ్ నంబర్ ర్యాంకర్‌గా ముగించనున్నాడు. ఆదివారం జరిగిన ఏటీపీ ఫైనల్స్(ATP Finals)లో జకో అతికష్టంగా హోల్గర్ రూనే(డెన్మార్క్)పై గెలుపొందాడు. 3 గంటల పాటు హోరాహోరీగా సాగినమారథాన్ మ్యాచ్‌లో 7-6 (4), 6-7 (1), 6-3తో విజయం సాధించాడు. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనైన జకోవిచ్ ఛాతిని బాదుకుంటూ సంబురాలు చేసుకున్నాడు. ఈ విజయంతో ఎనిమిదో ఏడాది వరల్డ్ నంబర్‌గా ముగించనున్నాడు.
‘చాలా కష్టంగా ఈ మ్యాచ్ గెలిచాను. ఈ మ్యాచ్ నాకు చాలా ప్రత్యేకం కావడంతో కొంచెం టెన్షన్‌కు గురయ్యాను. కోర్టులో పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యాను. చివరకు విజయంతో ముగించాను. వరల్డ్ నంబర్ 1గా ఈ ఏడాదిని ముగించడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది’ అని 36 ఏండ్ల జకోవిచ్ తెలిపాడు.
నొవాక్ జకోవిచ్
రెండేండ్ల క్రితం జకోవిచ్.. అమెరికా దిగ్గజం పీట్ సాంప్రాస్(6సార్లు) రికార్డు బ్రేక్ చేశాడు. అయితే.. నిరుడు యవ సంచనలం కార్లోస్ అల్కరాజ్ అతడిని వెనక్కి నెట్టి టాప్ సీడ్ దక్కించుకున్నాడు. అంతలోనే కరోనా వాక్సీన్ వివాదం, గాయం కారణంగా పలు టోర్నీలకు దూరమైన జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్‌తో రీ- ఎంట్రీ ఇచ్చాడు. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లి ట్రోఫీని ముద్దాడాడు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను దక్కించుకొన్న జకోవిచ్ మళ్లీ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. అంతేకాదు 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.