Wimbledon : పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రికార్డు సృష్టించిన నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) మరో ఫీట్ సాధించాడు. వింబుల్డన్‌లో తన జోరు చూపిస్తున్న సెర్బియా స్టార్ 19వ సారి మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. దాంతో, లెజెండరీ ఆటగాడైన రోజర్ ఫెదరర్ (Roger Federer) రికార్డును బద్ధలు కొట్టాడు. బుధవారం సెంట్రల్ కోర్టులో జరిగిన మ్యాచ్‌లో డెవాన్ ఎవాన్స్‌ను 6-3, 6-2, 6-0తో చిత్తుగా ఓడించి ఈ ఘనతకు చేరువయ్యాడు జకో. ఈ గ్రాండ్‌స్లామ్‌లో అతడికిది 99వ మ్యాచ్ కావడం విశేషం.
టెన్నిస్‌లో రికార్డు స్థాయిలో 24 గ్రాండ్‌స్లామ్స్ గెలుపొందిన జకోవిచ్‌కు వింబుల్డన్ ఫేవరెట్ టోర్నీ. పచ్చిక కోర్టు మీద ఈ యోధుడు అత్యధికంగా ఏడుసార్లు విజేతగా నిలిచాడు. ఈసారి కూడా టైటిల్‌పై గురి పెట్టిన జకో.. 19వ సారి మూడో రౌండ్లో అడుగుపెట్టడంతో సంతోషం వ్యక్తం చేశాడు. వింబుల్డన్‌లో 19 సార్లు మూడో రౌండ్‌కు చేరడం నాకు నిజంగా చాలా గొప్ప ఆరంభం. ఇదే ఫామ్ కొనసాగించాలనుకుంటున్నా అని జకో తెలిపాడు.