MLA Marri rajashekar reddy | మల్కాజిగిరి, జులై 3: ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం బోయిన్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మౌలాలి డివిజన్ పిల్లి నరసింగ రావు కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యేకు నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కాలనీలో పవర్ బోర్ మరమ్మత్తులు, సింగిల్ ఫేస్ నుండి త్రీఫేస్ కరెంటు కన్వర్షన్, కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. నీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా పవర్ బూస్టర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అమినుద్దీన్, కాలనీవాసులు వెంకట్ రెడ్డి, గణేష్, అంజయ్య, కిషోర్, వేణు, రాజు, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.
SI Rajeshwar | బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
Fake medicines | ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా.. పట్టించుకోని అధికారులు
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్