Sachin – Maxwell : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూర్కర్(Sachin Tendulkar) అభిమనగణానికి హద్దులు లేవనే విషయం తెలిసిందే. ఈ మాజీ క్రికెటర్ ఎక్కడ కనిపించినా అభిమానులు పోటెత్తుతారు. యువ క్రికెటర్లు అయితే అతడి నుంచి విలువైన సలహాలు తీసుకునేందుకు పోటీపడతారు. అయితే.. గత కొన్ని రోజులుగా సచిన్‌కు సంబంధించిన ఒక ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్(Glenn Maxwell) సచిన్ కాళ్లకు నమస్కరిస్తున్నాడు. ఆ ఫొటో చూసిన ఫ్యాన్స్ ఇది నిజమేనా? అని ఆశ్చర్యపోయారు.
దాంతో, ఆ ఫోటోపై పరిశోధన చేసిన డీఫ్రాక్(DFRAC team) బృందం అదొక నకిలీ ఫొటో అని, డిజిటల్‌గా ఎడిట్ చేశారని చెప్పింది. అఫ్గనిస్థాన్ క్రికెటర్లకు సచిన్ హేక్‌హ్యాండ్ ఇస్తున్న ఫొటోను కొందరు మార్ఫింగ్ చేశారని స్పష్టం చేసింది. భారత గడ్డపై 12 ఏండ్ల తర్వాత జరిగిన వరల్డ్ కప్‌లో సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. దాంతో, ప్రతి మ్యాచ్ అనంతరం మాస్టర్ బ్లాస్టర్ యువ ఆటగాళ్లతో మాట్లాడుతుండేవాడు.
Keep peddling #FakeNarratives
Photo Of Glenn Maxwell Touching Sachin Tendulkar’s Feet Is Fabricated | BOOM https://t.co/8zKRW02Gsp
— 𝐒𝐢𝐝𝐝 (@sidd_sharma01) November 10, 2023
అలానే.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ మ్యాచ్ అనంతరం సచిన్ కాబూలీ కుర్రాళ్లతో ముచ్చటించాడు. ఆ సమయంలో తీసిన ఫొటోను కొందరు ప్రబుద్ధులు డీప్‌ఫేక్ చేశారు. అఫ్గన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో విరుచుకుపడిన మ్యాక్సీ జట్టును సెమీస్ రేసులో నిలిపాడు.
ఈమధ్య కాలంలో సెలబ్రిటీలను టార్గెట్‌గా చేసుకొని డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలు వస్తున్న విషయం తెలిసిందే. టెక్నాలజీ సాయంతో కన్నడ హీరోయిన్ రష్మిక మండన్నా(Rashmika Mandanna), బాలీవుడ్ బ్యూటీ అలియా భట్(Alia Bhat)ల నకిలీ ఫొటోలు వైరల్ కావడం చూశాం.