bulldozer action | రాజస్థాన్‌కు వ్యాపించిన బుల్డోజర్ యాక్షన్.. కర్ణిసేన చీఫ్‌ను కాల్చి చంపిన నిందితుడి ఇల్లు కూల్చివేత
bulldozer action | తాజాగా బీజేపీ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్‌కు బుల్డోజర్ యాక్షన్ (bulldozer action) వ్యాపించింది. కర్ణిసేన చీఫ్‌ను కాల్చి చంపిన నిందితుడి ఇంటిని అధికారులు కూల్చివేశారు. నిందితుల్లో ఒకరైన రోహిత్ రాథోడ్ ఇంటిని అక్రమంగా నిర్మించినట్లు జైపూర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆరోపించారు.
జైపూర్: తాజాగా బీజేపీ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్‌కు బుల్డోజర్ యాక్షన్ (bulldozer action) వ్యాపించింది. కర్ణిసేన చీఫ్‌ను కాల్చి చంపిన నిందితుడి ఇంటిని అధికారులు కూల్చివేశారు. నిందితుల్లో ఒకరైన రోహిత్ రాథోడ్ ఇంటిని అక్రమంగా నిర్మించినట్లు జైపూర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఖతీపురాలోని ఆ ఇంటిని అధికారులు గురువారం కూల్చివేశారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.
కాగా, డిసెంబర్ 5న జైపూర్‌లోని ఇంట్లో ఉన్న రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ ఇంట్లోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ హత్య తామే చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ఫేస్బుక్లో పేర్కొన్నాడు.
మరోవైపు డిసెంబర్ 9న రాజస్థాన్ పోలీసులు, ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కర్ణిసేన చీఫ్‌ను కాల్చి చంపిన ఇద్దరు నిందితులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీతో పాటు అనుచరుడు ఉద్ధంను చండీగఢ్‌లో అరెస్టు చేశారు. భూ వివాదం నేపథ్యంలో రోహిత్ గోదారా, అతడి సన్నిహితుడు వీరేంద్ర చరణ్ ఆదేశాల మేరకు కర్ణిసేన చీఫ్ హత్య జరిగినట్లు పోలీసుల ముందు నితిన్ ఫౌజీ అంగీకరించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

