IPL 2025 : ఐపీఎల్ ప్రతి సీజన్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగే చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 18వ సీజన్లో మరీ దారుణంగా ఆడుతోంది. ఎంఎస్ ధోనీ(MS Dhoni) కెప్టెన్సీలో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన సీఎస్కే ఈసారి పసికూనను తలపిస్తోంది. స్టార్ బ్యాటర్లు.. వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నా సరే సమిష్టితత్వం కొరవడడడంతో వరుస పరాజయాలతో అభిమానుల గుండెల్ని పిండేస్తోంది. అవును.. మ్యాచ్ మ్యాచ్‌కు పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శుక్రవారం చెపాక్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోవడంపై కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పందించాడు.
‘మా ఓపెనర్లు వరల్డ్ క్లాస్ ఓపెనర్లు. కచ్చితమైన క్రికెట్ షాట్లు ఆడగలరు. అంతేతప్ప.. స్వీప్ షాట్ల ద్వారా బౌండరీలు సాధించలేరు. విధ్వంసక బ్యాటింగ్ చేయలేరు. మిగతా టీమ్‌ల మాదిరిగా మా జట్టు 6 ఓవర్లలో 60 పరుగులు చేయలేదు. మా బ్యాటింగ్ లైనప్ చూశారుగా.. మేము ధాటిగా ఆడలేము. అయితే.. మా వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. ప్రత్యర్థి స్కోర్‌ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా ముఖ్యం.
𝘿𝙤 𝙮𝙤𝙪 𝙜𝙚𝙩 𝙩𝙝𝙚 𝘿𝙚𝙟𝙖 𝙑𝙪? 👀 pic.twitter.com/nsudpeIpEG
— KolkataKnightRiders (@KKRiders) April 11, 2025
మొదటి ఐదు ఓవర్లలో చెలరేగి ఆడలేనప్పుడు మిడిల్ ఓవర్లలో దంచాలి. అదీ సాధ్యం కాదంటే.. కనీసం డెత్ ఓవర్లలోనైనా బ్యాట్ ఝులిపించాలి. ఇక కోల్‌కతాపై మేము పోరాడగలిగే స్కోర్ చేయలేదు. అందుకే.. ఓడిపోయాం’ అని ధోనీ వెల్లడించాడు. 17వ సీజన్ ముందు కెప్టెన్సీ వదులుకున్న ధోనీ.. రుతురాజ్ గైక్వాడ్ నిష్క్రమణతో మళ్లీ పగ్గాలు అందుకున్నాడు. సారథిగా 18వ సీజన్లో తొలి పోరులో జట్టును గెలిపించాలని అనుకున్న మహీ కల నిజం కాలేదు. తర్వాతి మ్యాచ్‌లో చెన్నై ఏప్రిల్ 14 న లక్నో సూపర్ జెయింట్స్(LSG)ను ఢీ కొట్టనుంది.