PEDDAPALLY | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 12 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో మహమ్మాయిదేవి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిసాయి, చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
హోమాల పైన దంపతులు కూర్చొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదిపరాశక్తిగా పిలవబడుతున్న మహమ్మాయి దేవతను విశ్వబ్రాహ్మణులు, అనుబంధ కులస్తుల ఆరాధ్య దైవం అమ్మవారిని దర్శించుకుని మోక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీష్‌ఘడ్ నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాల నిర్వాహకులు దేవరకొండ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సౌకర్యం, చలవ పందిళ్లు ఇతరత్రా మౌళిక వసతులు అన్ని ఏర్పాట్లు చేశారు,, ఎస్సై శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. భక్తులకు వాహనదారులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.