Carlos Alcaraz : మొనాకో వేదికగా జరుగుతున్న మాంటే కార్లో మాస్టర్స్ 1000 టోర్నమెంట్లో కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) దుమ్మురేపుతున్నాడు. టాప్ గేర్‌లో ఆడుతున్న ఈ యువకెరటం అలవోకగా పురుషుల సింగిల్స్ సెమీస్ ఫైనల్లో అడుగుపెట్టాడు. శుక్రవారం క్లే కోర్టులో జరిగిన క్వార్టర్స్‌లో అల్కరాజ్ ఫ్రాన్స్‌కు చెందిన ఆర్ధర్ ఫిల్స్(Arthur Fils)ను చిత్తుగా ఓడించాడు.
తొలి సెట్ కోల్పోయినా.. ఆ తర్వాత పుంజుకొన్న ఈ టాప్ సీడ్ ప్లేయర్ 4-6, 7-5, 6-3తో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ఆరంభంలో వెనకబడినా.. ఆత్మవిశ్వాంసతో ఆడి మ్యాచ్ సొంతం చేసుకోవడం గర్వంగా ఉందని చెప్పాడీ స్పెయిన్ కుర్రాడు. సెమీస్‌లో తమ దేశానికే చెందిన అతడు అలెజండ్రో డేవిడొవిచ్తో తలపడనున్నాడు.
Carlos Alcaraz hits a gorgeous drop shot against Fils in Monte Carlo.
Great serve followed up with the softest touch.
He was down 0-40 in this game.
Beautiful tennis.
— The Tennis Letter (@TheTennisLetter) April 11, 2025
‘నేను ఆత్మవిశ్వాసంతో ఉండాలని అనుకున్నా. ప్రత్యర్థి దూకుడుగా ఆడుతుండగా నా వంతు కోసం వేచి చూశాను. ఫిల్స్ కొన్ని తప్పిదాలు చేయడం నాకు కలిసొచ్చింది. వాటిని నేను వీలైనన్ని పాయింట్లుగా మలచుకోవాలనున్నాను. సెకండ్ సెట్లో బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నా. మూడో సెట్లోనూన అదే జోరు కొనసాగించి సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నాను’ అని మ్యాచ్ అనంతరం కార్లోస్ తెలిపాడు.
ఇప్పటివరకూ 17 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్ గెలుపొందిన ఈ స్పెయిన్ వీరుడు ఈసారి కూడా టైటిల్ కొల్లగొట్టాలనే కసితో ఉన్నాడు. క్వార్టర్స్‌లో ఓటమిని తట్టుకోలేకపోయిన 20 ఏళ్ల ఫిల్స్ రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.