Hebah patel | సినిమా ఇండస్ట్రీలో రాణించే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అవకాశాలు రావడం చాలా అరుదు. ఆ అవకాశాలని నిలబెట్టుకోవడం కూడా పెద్ద టాస్కే. కొంత మంది భామలు అయితే ఓవర్‌నైట్ స్టార్స్‌గా మారిపోతుంటారు. మరి కొందరు మాత్రం ఎన్ని సినిమాలు చేసిన సక్సెస్ రాక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారిలో హెబ్బా పటేల్ ఒకరు. ఈ అమ్మడు తెలుగులో 16 సినిమాలు చేసింది, అందులో హిట్ అయిన సినిమాలు రెండు మాత్రమే. ఇక చేసేదేం లేక సెకండ్ హీరోయిన్గా కూడా మారింది. అయిన కూడా సక్సెస్ వరించలేదు. స్పెషల్ సాంగ్స్ చేసింది. వాటితో కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.
ఇక చేసేదేం లేక సోషల్ మీడియాలో సందడి చేస్తూ హంగామా చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన అందచందాలతో కుర్రాళ్లకి వల విసురుతూ ఉంటుంది.ఇటీవలి కాలంలో హెబ్బా కాస్త స్లిమ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే పిక్స్ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతుంటారు. సినిమాలతో కాకపోయిన కనీసం తన అందాలతో అయిన క్రేజ్ పెంచుకోవాలని హెబ్బా ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఇక హెబ్బా కెరియర్ చూస్తే అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నదాని పేరు మారుమ్రోగింది.
దాంతో వరుసగా అవకాశాలు వచ్చాయి కాని అవి సక్సెస్ కాలేకపోయాయి. తెలుగువారిని అలరించిన ముంబై ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఎందుకో కెరీర్లో వెనుకబడిపోయింది . ఇప్పుడు బ్రేక్ కోసం తెగ కష్టపడుతోంది. 6 జనవరి 1989న ముంబైలో జన్మించిన హెబ్బా పటేల్ సోఫియా కాలేజ్ ఫర్ ఉమెన్‌లో చదువుకుంది. వీరి కుటుంబం కర్ణాటక నుంచి మహారాష్ట్రకు వలస వెళ్లిన ముస్లిం ఫ్యామిలీ కాగా, ఈమె పేరు చివరన పటేల్ అన్న ట్యాగ్ చూసి ఈమెను చాలా మంది గుజరాతీ అమ్మాయిగా అనుకుంటారు. 2014లో అధ్యక్ష అనే కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హెబ్బా పటేల్. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నఈమె ఆ తర్వాత తమిళ సినిమా తిరుమనం ఏనుం నిఖా అనే సినిమాలో జై సరసన నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత అలా ఎలా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.