Match Fixing : భారత, దక్షిణాఫ్రికా సిరీస్‌పై ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య 2000 సంవత్సరంలో జరిగిన సిరీస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ (Match Fixing) జరిగిన మాట వాస్తవమేనని తెలిపింది. అంతేకాదు ఇతర మ్యాచ్‌లను కూడా ఫిక్సింగ్ చేసేందుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ హన్సీ క్రొంజే (Hansie Cronje) ప్రయత్నించారని వెల్లడించింది. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు నలుగురిపై చార్జిషీట్ దాఖలు చేసింది.
టీమిండియా, సఫారీ జట్ల మధ్య 2000లో టెస్టు, వన్డే సిరీస్ జరిగింది. ఆ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 19 వరకూ ఇరు దేశాలు రెండు టెస్టులు, ఐదు వన్డేలు ఆడాయి. ‘ఆ పర్యటనలో టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఒక ఇన్నింగ్స్‌లో 250 కంటే ఎక్కువ పరుగులు చేయకూడదు.

ఇదే విషయాన్ని అప్పటి దక్షిణాఫ్రికా సారథి హన్సీ క్రొంజే, జట్టులో సభ్యుడైన పీటర్ స్ట్రిడామ్ (pieter strydom)లు కింగ్స్ కమిషన్ ముందు అంగీకరించారు. అయితే.. మార్చి 2 న మొదలైన రెండో టెస్టులో హన్సీ ఆటగాళ్లతో మాట్లాడి ఫిక్సింగ్‌కు ప్రయత్నించాడు. కానీ, ఆ మ్యాచ్ ఫిక్స్ అయినట్టు ఆధారాలు లభించలేద’ ని కోర్టు వెల్లడించింది.
22 years of unanswered questions beyond the boundary lines.
Hansie Cronje ❤️ pic.twitter.com/wApyK5zwXd— Saurabh Desai (@sau_desai) June 1, 2024
అయితే.. తొలి వన్డే మాత్రం ఫిక్స్ అయింది. మార్చి 16వ తేదీన రికార్డు చేసిన స్టేట్మెంట్లో హన్సీ తనకు డబ్బులు ఇవ్వాలని సంజీవ్ చావ్లా అనే వ్యక్తిని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత సంజీవ్ అతడికి పైసలు పంపాడు. ఆ తర్వాత జరిగిన నాలుగో, ఐదో వన్డేలోనూ హన్సీ తమ టీమ్ ఆటగాళ్లను ఫిక్సింగ్‌కు ప్రోత్సహించాడు. కానీ, హెర్షెలీ గిబ్స్, హెన్రీ విలియమ్స్‌లకు 1,500 డాలర్ల ఆశ చూపాడు. అయితే.. వాళ్లిద్దరూ మ్యాచ్ సమయంలో ఆ విషయం మర్చిపోయారు అని ఢిల్లీ కోర్టు తెలిపింది.
హన్సీ క్రొంజే
