Delhi Capitals | ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీ విడుదల.. స్పెషల్ ఏంటంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఈరోజు కొత్త జెర్సీని విడుదల చేసింది. పదహారో సీజన్ ఐపీఎల్లో ఆ జట్టు ప్రకాశవంతమైన జెర్సీతో బరిలోకి దిగనుంది. ఢిల్లీ కొత్త జెర్సీ ప్రత్యేకత ఏంటంటే..? చేతులు, భుజాల మీద ప్రకాశవంతమైన ఎరుపు రంగు ఉంది.
Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఈరోజు కొత్త జెర్సీని విడుదల చేసింది. పదహారో సీజన్ ఐపీఎల్లో ఆ జట్టు ప్రకాశవంతమైన జెర్సీతో బరిలోకి దిగనుంది. ఢిల్లీ కొత్త జెర్సీ ప్రత్యేకత ఏంటంటే..? చేతులు, భుజాల మీద ప్రకాశవంతమైన ఎరుపు రంగు ఉంది. ముందు భాగంలో ఎరుపు బదులు నీలం రంగు ఉంది. గత సీజన్లో జెర్సీలో రెడ్ కలర్ ఎక్కువగా ఉండేది. ఢిల్లీ యాజమాన్యం కొత్త జెర్సీ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘కొత్త ఢిల్లీ.. కొత్త జెర్సీ ఇదిగో. ఈ రోజు ఢిల్లీలో విడుదల చేశాం. ఈ కొత్త జెర్సీని అందరి కంటే ముందుగా సవేర అసోసియేషన్‌కు చెందిన పిల్లలు
ధరించారు’ అని క్యాప్షన్ రాసింది.
వార్నర్ కెప్టెన్సీలో..
ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నడిపించనున్నాడు. ఈమధ్యే ఢిల్లీ యాజమాన్యం వార్నర్‌ను కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ గాయం కారణంగా ఈ సీజన్లో ఆడడం లేదు. గత ఏడాది అతను కారు యాక్సిడెంట్లో గాయపడ్డాడు. ఐపీఎల్ పదహారో సీజన్ మార్చి 31న ప్రారంభం కానుంది. ఆ మరునాడే (ఏప్రిల్ 1న) లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ తలపడనుంది. ఓపెనర్ పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మనీష్ పాండేతో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, నాగర్కోటి, ఎంగిడి, ముఖేశ్ కుమార్‌తో ఢిల్లీ బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది.
Kyu Dilli, kaisa laga surprise❓🤩#NayiDilliKiNayiJersey is here 👕
Launched in the city, for the city, and with the city. Children from the Savera Association were among the first to don the season’s new threads at this morning’s #RunForGood event with our players ❤️💙 pic.twitter.com/VDtJnmooTE
— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2023
ఇవి కూడా చదవండి
Dasara | దసరా స్పెషల్ ప్రమోషన్స్.. వైజాగ్ స్టేడియంలో నాని
Payal Ghosh | మూడో మీటింగ్‌లోనే నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.. ఆ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాయల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

