Dasara | దసరా స్పెషల్ ప్రమోషన్స్.. వైజాగ్ స్టేడియంలో నాని
నాని (Nani) ఊరమాస్ ఎంటర్టైనర్ దసరా (Dasara). టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో నాని సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) త్వరలోనే దసరా (Dasara) సినిమాతో ఊరమాస్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన దసరా టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో నాని సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
నాని దసరా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మూవీ లవర్స్ తోపాటు స్పోర్ట్స్ లవర్స్ మధ్యకు వెళ్లాడు. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ జరుగుతున్న వైజాగ్ స్టేడియంలో సందడి చేశాడు నాని. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్‌తో దసరా నుంచి ధూమ్ ధామ్ దోస్తాన్ సిగ్నేచర్ స్టెప్ వేయించాడు నాని. ఈ వీడియోను ఎస్ఎల్వీసీ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. అదేవిధంగా స్టార్ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మగురించి నాని చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
దసరా చిత్రంలో నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్, దీక్షిత్ శెట్టి, మాలీవుడ్ యాక్టర్ షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి దసరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
స్టేడియంలో నాని సందడి ఇలా…
#DhoomDhaam ft. Natural Star @NameisNani & Former Australian Captain @AaronFinch5 at the #IndVsAus match in Visakhapatnam 🔥🥳💃🏾 #Dasara #DasaraOnMarch30th pic.twitter.com/q9C5ijA3DS
— SLV Cinemas (@SLVCinemasOffl) March 19, 2023
https://twitter.com/farrfetchdd/status/1637371611258003459
Natural Star @NameisNani on ground from Visakhapatnam during the #IndVsAus 🔥💥
Go Team India! Let's win the series.#Dasara #DasaraOnMarch30th @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/45IVJaWHb2
— SLV Cinemas (@SLVCinemasOffl) March 19, 2023
Hey Visakhapatnam, brace yourselves for an exciting day, covers are coming off and the sun's shining bright ☀️
Catch our Dharani aka Natural Star @NameisNani cheering up for team India at the #IndVsAus Match today🔥💥#Dasara #DasaraOnMarch30th pic.twitter.com/NSbZJMN89m
— SLV Cinemas (@SLVCinemasOffl) March 19, 2023
దసరా ట్రైలర్..
స్టన్నింగ్ మాస్ టీజర్‌పై ఓ లుక్కేయండి..
ఛమ్కీలా అంగీలేసి ఓ వదినే లిరికల్ వీడియో సాంగ్
Read Also :
RC 15 | గొప్ప అనుభూతినిస్తోంది.. ప్రభుదేవా టీం సర్ప్రైజ్పై రాంచరణ్
Kabzaa | కబ్జ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉపేంద్ర టీం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

