Wimbledon : వింబుల్డన్‌లో ఆరో రోజు కూడా సంచనాల పర్వం కొనసాగింది. మహిళల సింగిల్స్‌లో నిరుడు ఛాంపియన్‌గా నిలిచిన బర్బొరా క్రెజికోవా (Barbora Krejcikova) అనూహ్యంగా మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. పదో సీడ్ ఎమ్మా నవర్రో(అమెరికా) చేతిలో పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్ (Jannik Sinner) సునాయసంగా నాలుగో రౌండ్లో అడుగుపెట్టాడు.
శనివారం జరిగిన పోరులో ఎమ్మా ధాటికి డిఫెండింగ్ ఛాంపియన్ నిలువలేకపోయింది. తొలి సెట్‌ను కోల్పోయిన అమెరికా స్టార్ ఆ తర్వాత పుంజుకొని క్రెజికోవాకు షాకిస్తూ 2-6, 6-3, 6-4తో నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇక పురుషుల సింగిల్స్‌లో ఇటలీ స్టార్ సిన్నర్ జోరు చూపించాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)ను 6-1, 6-3, 6-1తో మట్టికరిపించాడు. దాంతో అతడు వరుసగా నాలుగో ఏడాది మూడో రౌండ్ దాటాడు.
No.1 Court rises for our 2024 Ladies’ Singles Champion
We look forward to seeing you next year, Barbora 💚#Wimbledon pic.twitter.com/StLUVMq1Lw
— Wimbledon (@Wimbledon) July 5, 2025