దుబాయ్ : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఐసీసీ ఉమెన్స్ టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అత్యుత్తమ స్థానాన్ని సొంతం చేసుకుంది. 28 ఏండ్ల ఈ ఆగ్రా అమ్మాయి.. తన కెరీర్లో తొలిసారి టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
శ్రీలంకతో తొలి టీ20లో ఒక వికెట్ తీయడంతో ఆమె.737 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్‌లో నిలిచింది.