లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2025 లో యూపీ వారియర్స్ కొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఆ జట్టుకు సారథిగా వ్యవహరించనుంది. రెగ్యులర్ కెప్టెన్ అలీస్సా హీలి కాలిగాయంతో సీజన్ మొత్తానికీ దూరమైన నేపథ్యంలో వారియర్స్ యాజమన్యం.. దీప్తికి ఆ బాధ్యతలు అప్పగించింది.