IND vs SL : వన్డే సిరీస్‌లో ఆఖరిదైన మూడో వన్డేలో భారత బౌలర్లు శ్రీలంక(Srilanka)ను అద్భుతంగా కట్టడి చేశారు. అరంగేట్ర కుర్రాడు రియాన్ పరాగ్(3/54) సూపర్ స్పెల్‌లో రాణించగా ఆతిథ్య జట్టు 248 రన్స్ చేసింది. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో(94), పథుమ్ నిశాంక(45)లు లంకు శుభారంభమిచ్చినా మిడిలార్డర్ చేతులెత్తేసింది. ఆఖర్లో కుశాల్ మెండిస్(59), కమింద్ మెండిస్(23 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. దాంతో, శ్రీలంక పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.
రెండో వన్డేలో విజయంతో జోరు మీదున్న లంక మూడో మ్యాచులోనూ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో(94), పథుమ్ నిశాంక(45) తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించి పునాది వేశారు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడుతూ భారత బౌలర్లను ఒత్తిడికి గురి చేశారు. సెంచరీ భాగస్వామ్యం దిశగా వెళ్తున్న ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు.
Riyan Parag denies Avishka Fernando his fourth ODI century 💔https://t.co/CttffvyZ8i #SLvIND pic.twitter.com/Hw6Kcy6ZqG
— ESPNcricinfo (@ESPNcricinfo) August 7, 2024
ఆ తర్వాత వచ్చిన కుశాల్ మెండిస్(59) తో కలిసి అవిష్క ఫెర్నాండో దంచాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 85 రన్స్ జోడించారు. శతకానికి చేరువైన అవిష్కను ఎల్బీగా వెనక్కి పంపిన రియాన్ పరాగ్(3/54) విడదీసి వన్డేల్లో తొలి వికెట్ సాధించాడు. అక్కడితో ఆతిథ్య జట్టు స్కోర్ నెమ్మదించింది. తొలి రెండు వన్డేల్లో పెద్దగా రాణించని కెప్టెన్ చరిత అసలంక(10)ను పరాగ్ ఔట్ చేసి లంకను మళ్లీ దెబ్బకొట్టాడు.
Riyan Parag made the vital breakthrough on his ODI debut 🙌#SLvIND LIVE: https://t.co/CttffvyZ8i pic.twitter.com/maS2VV5Ino
— ESPNcricinfo (@ESPNcricinfo) August 7, 2024
ఆ షాక్ నుంచి తేరుకునేలోపే సధీర సమరవిక్రమ(0)ను సిరాజ్ డకౌట్‌గా డగౌట్‌కు పంపాడు. దాంతో, లంక స్కోర్ 200 కూడా దాటడం గగనం అనిపించింది. ఆ పరిస్థితుల్లో మెండిస్, కమిందు మెండిస్(23 నాటౌట్) తో దూకుడుగా ఆడాడు. పరాగ్ వేసిన ఓవర్లో రెండు బౌండరీలతో అర్ధ సెంచరీ సాధించాడు. భారీ షాట్ ఆడగా బౌండరీ వద్ద శుభ్‌మన్ గిల్ చక్కని క్యాచ్‌తో అతడి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఆఖరి ఓవర్లో 13 పరుగులు రావడంతో భారత్‌కు ఆతిథ్య జట్టు 249 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.